ఇండియాలోకి మరో రెండు సూపర్ ఫాస్ట్ బైక్స్.. లిమిటెడ్ ఎడిషన్ తో 775 యూనిట్లు మాత్రమే లాంచ్..

First Published | Apr 21, 2021, 3:46 PM IST

అతిపెద్ద  యు.కే  మోటారుసైకిల్ సంస్థ ట్రయంఫ్   కొద్దిరోజుల క్రితం ఇండియాలో స్క్రాంబ్లర్ 1200  కొత్త 2021 వెర్షన్‌ను ప్రవేశపెట్టింది.  ఇప్పుడు  తాజాగా కొత్త  అప్ డేట్ ఇంజిన్‌తో  స్ట్రీట్ స్క్రాంబ్లర్ 900, లిమిటెడ్ ఎడిషన్ స్ట్రీట్ స్క్రాంబ్లర్  సాండ్ స్ట్రోమ్ కూడా ఆవిష్కరించింది. 

ఈ లిమిటెడ్ ఎడిషన్ బైక్ లో మొత్తం 775 యూనిట్లను మాత్రమే కంపెనీ తయారు చేయనుంది. ఈ రెండు బైక్స్ ని త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల చేయబోతున్నారు.
స్ట్రీట్ స్క్రాంబ్లర్ 900ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ పాపులర్ బైక్ స్ట్రీట్ స్క్రాంబ్లర్ కొత్త వెర్షన్‌కి కొన్ని అప్ డేట్ లను పరిచయం చేసింది. ఇప్పుడు దీనికి అల్యూమినియం హెడ్‌లైట్ బ్రాకెట్, థొరెటల్ బాడీ ఫినిష్, హీల్ గోర్డ్, కొత్త సైడ్ ప్యానెల్స్‌ అందించారు. అలాగే అల్యూమినియం నంబర్ ప్లేట్, కొత్త డిజైన్ సీట్లు లభిస్తాయి. కానీ బైక్ డిజైన్ లో ఎటువంటి మార్పు చేయలేదు. స్ట్రీట్ స్క్రాంబ్లర్ 900 బైక్‌ను మూడు కలర్లలో లభిస్తుంది. వీటిలో అర్బన్ గ్రేలోని మాట్టే ఖాకీ, మాట్టే ఐరన్‌స్టోన్ అర్బన్ గ్రే, జెట్ బ్లాక్, డ్యూయల్ టోన్ మోడల్స్ ఉన్నాయి.

స్ట్రీట్ స్క్రాంబ్లర్ సాండ్ స్ట్రోమ్ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ లిమిటెడ్ ఎడిషన్ తో స్ట్రీట్ స్క్రాంబ్లర్ సాండ్ స్ట్రోమ్ కూడా తీసుకువస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 775 మంది మాత్రమే ఈ బైక్‌లను కొనుగోలు చేయగలరు. ఎందుకంటే ఈ బైక్ 775 యూనిట్లను మాత్రమే కంపెనీ సిద్ధం చేస్తుంది. ఈ బైక్ కి కొన్ని అందమైన మార్పులతో అందిస్తున్నారు. దీనికి హెడ్‌లైట్ గ్రిల్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ లభిస్తాయి. మాట్టే స్టార్మ్ గ్రే, ఐరన్‌స్టోన్ హైలెట్స్ ఈ బైక్ ఇంధన ట్యాంకుపై కనిపిస్తాయి. వీటితో పాటు ట్యాంక్‌పై రబ్బరు గ్రిప్ ప్యాడ్‌లను కూడా అందించారు. ఈ బైక్ కి హై మడ్‌గార్డ్‌లు లభిస్తాయి. సాండ్ స్టార్మ్ పెయింట్ స్కీమ్ తో లాంచ్ చేయనున్నారు.
ఇంజిన్ అండ్ పవర్ఈ రెండు బైక్స్ కి కంపెనీ ఒకే ఇంజన్‌ను అందిస్తుంది. రెండు బైక్స్ లో 900 సిసి పారలెల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజిన్ 65 హెచ్‌పి శక్తిని, 80 ఎన్‌ఎమ్‌ల పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కి 5 స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చారు. ఈ బైక్ లో రోడ్, రెయిన్, ఆఫ్-రోడ్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. ఈ బైక్ 16వేల కిలోమీటర్ల సర్వీసు ఇంటర్వల్ తో వస్తుందని కంపెనీ తెలిపింది.
బ్రేకింగ్ ఇంకా ఫీచర్లుబ్రేకింగ్ కోసం బైక్ ముందు భాగంలో 310 ఎంఎం డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో 255 ఎంఎం డిస్క్ బ్రేక్‌లు, ముందు భాగంలో 19 అంగుళాల వీల్స్, మెట్జెలార్ టోరెన్స్ టైర్లు, వెనుక భాగంలో 17 అంగుళాల వీల్స్ లభిస్తాయి. బైక్ ఫీచర్స్ గురించి చూస్తే పాత మోడల్ లో ఉన్న ఫీచర్స్ లభిస్తాయి. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉంటాయి.
ధరఈ రెండు బైక్స్ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కంపెనీ ప్రకారం వాటి ధర ప్రస్తుత మోడల్ ధరతో సుమారుగా ఉంటుంది. ప్రస్తుతం ఢీల్లీలోని స్ట్రీట్ స్క్రాంబ్లర్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ .8.55 లక్షలు.

Latest Videos

click me!