Top 5 Cars : మీరు హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి సిటీస్ లో ఉంటున్నారా? మీకు ఈ కార్లే బెస్ట్ ఆప్షన్స్

Published : Jun 09, 2026, 11:32 AM IST

పెద్దపెద్ద నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది.. ఇందుకు తగ్గట్లుగా డ్రైవింగ్ చేయడానికి సౌకర్యంగా, మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండే టాప్ 5 కార్లు, వాటి ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
సిటీలో డ్రైవ్ చేయడానికి బెస్ట్ కార్లు ఇవే..

పెద్ద నగరాల్లో కారు నడపడం చాలా సవాలుతో కూడుకున్న పని. గంటల తరబడి ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు, రోజురోజుకు పెరిగిపోతున్న మెయింటెనెన్స్ ఖర్చులు... ఇలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అందుకే చాలామంది చిన్న కారు కొనడమే ఉత్తమమని భావిస్తారు. మీరు కూడా మంచి సిటీ కారు కోసం చూస్తున్నట్లయితే, ఈ టాప్ 5 కార్ల జాబితా మీకోసమే.

25
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.60 లక్షల నుంచి రూ.8.04 లక్షల మధ్య ఉంది. రోజువారీ సిటీ ప్రయాణాలకు అనువుగా ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఏసీ వెంట్లు, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
35
మారుతి స్విఫ్ట్

మారుతి స్విఫ్ట్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.79 లక్షల నుంచి రూ.8.80 లక్షల వరకు ఉంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మాన్యువల్ గేర్‌బాక్స్ మోడల్‌లో మీరు కంపెనీ ఫిట్టెడ్ CNG కిట్ ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు. 

9-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన వెనుక ఏసీ వెంట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కీ-లెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్ దీని ముఖ్య ఫీచర్లు. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్‌వ్యూ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, ESC, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటివి ఈ స్విప్ట్ కారులో ఇచ్చారు.

45
టాటా టియాగో ఈవి ఆండ్ సిఎన్జి

టాటా టియాగో EV ఎక్స్-షోరూమ్ ధర రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉంది. ఇందులో 19.2 kWh, 24 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 285 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వెనుక ఏసీ వెంట్లు, USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం, ఈ సెగ్మెంట్‌లో మొదటిసారిగా 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు ఇచ్చారు.

టాటా టియాగో CNG AMT మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.80 లక్షల నుంచి రూ.8.55 లక్షల మధ్య ఉంది. దీని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 86 PS పవర్‌ను, 114 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే CNG మోడ్‌లో 76 PS పవర్‌ను, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో కంపెనీ ఫిట్టెడ్ CNG కిట్, డ్యూయల్-సిలిండర్ టెక్నాలజీతో వస్తుంది. దీనివల్ల బూట్ స్పేస్ గణనీయంగా పెరుగుతుంది. టియాగో CNGలో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

55
ఎంజీ కామెట్ EV

ఎంజీ కామెట్ EV ఎక్స్-షోరూమ్ ధర రూ.7.50 లక్షల నుంచి రూ.9.56 లక్షల వరకు ఉంది. ఇందులో 17.3 kWh బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కి.మీ. వరకు వెళ్తుంది. రోజువారీ సిటీ ప్రయాణాలకు ఇది ఒక మంచి ఎంపిక. 

వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, మాన్యువల్ ఏసీ, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కీ-లెస్ ఎంట్రీ సిస్టమ్ ఇందులో ఉన్నాయి. భద్రత కోసం రియర్‌వ్యూ కెమెరా, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ESC, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories