Car Accessories : కేవలం రూ.300 లోపే.. ఈ కార్ యాక్సెసరీలు మీ సొంతం!

Published : Jun 06, 2026, 04:35 PM IST

మీ కారులో కొన్ని యాక్సెసరీలు తప్పనిసరిగా ఉండాల్సిందే. వీటిని కొనడానికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు, కేవలం 300 రూపాయలలోపే దొరుకుతాయి. అవేంటి..? వాటి ధరలు ఎలా ఉంటాయి..? తెలుసుకుందాం. 

PREV
16
టైర్ ప్రెజర్ గేజ్

టైర్లలో గాలి తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా.. అది కారు మైలేజీపై ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు మారుమూల ప్రాంతాల్లో లేదంటే రాత్రి సమయంలో టైర్ పంచర్ అవుతుంటుంది.. ఇలాంటి సమయంలో మనమే టైర్ మార్చాల్సి ఉంటుంది. అందుకే చాలామంది టైర్ ప్రెజర్ గేజ్‌ను కారులో ఉంచుకుంటారు. దీని ద్వారా కారులో గాలిని చెక్ చేసుకోవచ్చు… అవసరం అనుకుంటే వెంటనే గాలి కొట్టించుకోవచ్చు. ఇది కేవలం రూ.300 లోపు ధరలోనే లభిస్తుంది.

26
ఎయిర్ ఫ్రెష్‍నర్

దాదాపు ప్రతి కారులోనూ ఇది కచ్చితంగా కనిపిస్తుంది. మార్కెట్లో రూ.300 లోపు ధరలో ఎన్నో రకాల ఎయిర్ ఫ్రెష్‌నర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో కారులో ముక్క వాసన రాకుండా ఉండేందుకు తప్పకుండా ఎయిర్ ఎయిర్ ఫ్రెష్‍నర్ వాడాలి. 

36
ఫోల్డబుల్ కప్ హోల్డర్

కొన్ని కార్లలో కప్ హోల్డర్లు ఉండవు. ఇలాంటివాటిలో ఫోల్డబుల్ కప్ హోల్డర్లను సులభంగా ఫిట్ చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ ధరకు లభిస్తుంది… లాంగ్ డ్రైవ్స్ సమయంలో ఇందులో వాటర్ బాటిల్ లేదంటే ఇతర బాటిల్స్ పెట్టుకోవచ్చు. 

46
నాన్-స్లిప్ మ్యాట్

డాష్‌బోర్డ్‌పై పెట్టిన ఫోన్, గాగుల్స్ వంటివి కింద పడిపోకుండా నాన్-స్లిప్ మ్యాట్ కాపాడుతుంది. ముఖ్యంగా కారు నడిపేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీంతో కారు డాష్ బోర్డు మరింత అందంగా మారుతుంది. 

56
నెక్ కుషన్

కొత్త కార్లలో సీట్ డిజైన్ చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. అయినా దూర ప్రయాణాల్లో సౌకర్యం కోసం చాలామంది నెక్ కుషన్లను వాడుతుంటారు. ఇవి కూడా కేవలం రూ.300 లోపు ధరలోనే లభిస్తాయి.

66
కార్ క్లీనింగ్ క్లాత్

చిన్న దుమ్ము కణాలు కూడా కారు పెయింట్‌పై గీతలు పెడతాయని తెలిసినవాళ్లు ఏ బట్ట పడితే ఆ బట్టతో కారును తుడవరు. దీనికోసమే మార్కెట్లో మృదువైన కార్ క్లీనింగ్ క్లాత్స్ దొరుకుతాయి. ఇవి చాలా తక్కువ ధరలో లభిస్తాయి. వాటినే వాడతారు.

Read more Photos on
click me!

Recommended Stories