కార్ సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు ఏ పార్ట్ ఎప్పుడు మార్చాలో మీకు తెలిస్తే.. వేలకు వేలు ఆదా చేసుకోవచ్చు. ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, బ్రేక్ ప్యాడ్ లాంటి ముఖ్యమైన భాగాల లైఫ్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.
చాలామంది కార్ ఓనర్లు సర్వీస్ సెంటర్‌కు వెళ్లినప్పుడు, అక్కడి టెక్నీషియన్లు చెప్పిందంతా గుడ్డిగా నమ్మేసి చాలా పార్ట్స్‌ను మార్పించేస్తుంటారు. కానీ ప్రతి స్పేర్ పార్ట్‌కు ఓ లైఫ్ టైమ్ ఉంటుంది. అది తెలుసుకుంటే అనవసర ఖర్చులు తగ్గడమే కాదు, మీ కారు కూడా సేఫ్‌గా ఉంటుంది.
25
ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్
కారు మంచి కండీషన్ లో ఉండాలంటే ఇంజిన్ ఆయిలే కీలకం. ఇది ఇంజిన్‌ను చల్లగా, స్మూత్‌గా నడిపిస్తుంది. సాధారణంగా మినరల్ ఆయిల్‌ను ప్రతి 8,000 - 10,000 కిలోమీటర్లకు, సింథటిక్ ఆయిల్‌ను 10,000 - 12,000 కిలోమీటర్లకు ఒకసారి మార్చాలి. ఇక ఎయిర్ ఫిల్టర్ ఇంజిన్‌కు స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. దుమ్ము ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తిరిగే కార్లలో దీన్ని తరచుగా చెక్ చేయాలి.
35
టైర్లు, బ్రేకులు చెక్ చేసుకొండి
కారు సేఫ్టీ, స్మూత్ రైడింగ్‌లో టైర్లది కీలక పాత్ర. అందుకే ప్రతి 8,000 నుంచి 10,000 కిలోమీటర్లకు ఒకసారి టైర్ రొటేషన్ చేయించాలి. దీనివల్ల టైర్లు సమానంగా అరిగి ఎక్కువ కాలం మన్నుతాయి. బ్రేక్ ప్యాడ్‌లను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో ఎక్కువగా తిరిగే కార్లలో ఇవి త్వరగా అరిగిపోతాయి.
కూలెంట్, స్పార్క్ ప్లగ్స్ వంటి భాగాలను వెంటనే మార్చాల్సిన అవసరం లేదు. ఇవి సాధారణంగా 30,000 నుంచి 40,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తాయి. కాబట్టి వీటిని అనవసరంగా మార్పించి డబ్బులు వృధా చేసుకోవద్దు.
55
గేర్ ఆయిల్ మర్చిపోవద్దు
గేర్ ఆయిల్‌ను తరచుగా మార్చాల్సిన పనిలేదు. చాలా కార్లలో ఇది 50,000 నుంచి 60,000 కిలోమీటర్ల వరకు బాగానే పనిచేస్తుంది. సరైన టైమ్‌కు కారుకు మెయింటెనెన్స్ చేయిస్తే అది ఎక్కువ కాలం స్మూత్‌గా నడుస్తుంది, మీ డబ్బు కూడా ఆదా అవుతుంది.