Top 5 Cars : కేవలం రూ.10 లక్షలలోపే ధర.. 5 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవే..!

Published : Feb 11, 2026, 02:56 PM IST

భారత్‌లో తక్కువ ధరలో లభించే ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో డ్రైవింగ్‌ను సులభం చేసే ఈ కార్లపై చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. రూ.10 లక్షల లోపు ధరలో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఏవో చూద్దాం.

PREV
15
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

వేరియంట్: VXi (O) AGS.

ధర: రూ. 4.75 లక్షలు (ఎక్స్-షోరూమ్).

5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది ఈ మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో. ఈ కారు ఇండియాలో అత్యంత చవకైన ఆటోమేటిక్ కార్లలో ఒకటి. జీఎస్టీ తగ్గింపు తర్వాత ఇది మరింత అందుబాటు ధరలోకి వచ్చింది. ఇందులో నలుగురు సౌకర్యంగా ప్రయాణించవచ్చు. దీనికి 68 PS పవర్ ఇచ్చే 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది.

25
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్

వేరియంట్ : VXi AGS. 

ధర : రూ. 5.97 లక్షలు (ఎక్స్-షోరూమ్). 

వ్యాగన్ ఆర్ VXi వేరియంట్ నుంచి ఆటోమేటిక్ మోడల్ మొదలవుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే 1-లీటర్, 1.2-లీటర్ ఇంజిన్ ఆప్షన్లు రెండింటిలోనూ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది. టాల్ బాడీ డిజైన్ వల్ల కారు ఎక్కడం, దిగడం చాలా సులువు.

35
టాటా టియాగో

వేరియంట్ : XTA. 

ధర : రూ. 6.31 లక్షలు (ఎక్స్-షోరూమ్). 

టాటా నుంచి వచ్చిన బెస్ట్ ఎంట్రీ-లెవల్ ఆటోమేటిక్ కారు ఇది. దీనిలోని 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పెట్రోల్‌తో పాటు CNG వేరియంట్‌లోనూ లభించడం దీని ప్రత్యేకత. సేఫ్టీ, ఫీచర్ల విషయంలో టియాగో చాలా ముందుంటుంది.

45
మారుతి సుజుకి స్విఫ్ట్

వేరియంట్ : VXi AGS. 

ధర : రూ. 7.04 లక్షలు (ఎక్స్-షోరూమ్).

5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే ఈ కారు యువతకు ఫేవరెట్. స్విఫ్ట్‌లో VXi వేరియంట్ నుంచి ఆటోమేటిక్ ఆప్షన్ మొదలవుతుంది. దీనిలోని కొత్త 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 82 PS పవర్‌ను ఇస్తుంది. ఇది అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

55
హ్యుందాయ్ i20

వేరియంట్ : మాగ్నా IVT. 

ధర : రూ. 8.13 లక్షలు (ఎక్స్-షోరూమ్). 

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లోని ఈ కారులో CVT గేర్‌బాక్స్ ఉంటుంది. ఇది స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఈ కారు 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories