Maruti Suzuki Wagon R : ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వ్యాగనార్ మోడల్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఫిబ్రవరి 2026 లో కొనుగోలు చేసేవారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
మారుతి సుజుకి వ్యాగనార్ కారు లాంచ్ అయి 25 ఏళ్లు పూర్తయింది. ఇప్పటికీ ఈ కారు అమ్మకాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ కారు సేల్స్ ను మరింత పెంచేందుకు మారుతి సుజుకి సిద్దమయ్యింది... అందుకే ఈ నెల (2026 ఫిబ్రవరి) లో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. పర్సనల్ వేరియంట్లపై రూ.37,500 వరకు, ట్యాక్సీ మోడల్ టూర్ H3పై రూ.40,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఈ కారుకు ఉన్న ప్లస్ పాయింట్స్.
25
తక్కువ ధరలో బెస్ట్ కారు వ్యాగనార్
ప్రపంచవ్యాప్తంగా కోటి యూనిట్లకు పైగా అమ్ముడైన వ్యాగనార్ భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. 2026 ఫిబ్రవరిలో తక్కువ ధరలో, నమ్మకమైన, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు కొనాలనుకుంటే వ్యాగనార్ మీకు సరైన ఎంపిక. మారుతి కంపెనీ తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారుపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటించింది. దీంతో ఈ కారును కొనడం మరింత సులభం అవుతుంది.
35
రూ.37,500 వరకు ఆఫర్
2026, ఫిబ్రవరిలో మారుతి వ్యాగనార్ పర్సనల్ వేరియంట్లపై రూ.37,500 వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎత్తైన సీటింగ్, మంచి స్పేస్, బెస్ట్ మైలేజ్ కారణంగా ఈ కారు ఫ్యామిలీ కార్ కొనేవారిని బాగా ఆకర్షిస్తోంది.
కమర్షియల్, ట్యాక్సీ విభాగాల కోసం మారుతి సుజుకి వ్యాగనార్ పై మంచి డిస్కౌంట్లను అందిస్తోంది. తక్కువ మెయింటెనెన్స్, బెస్ట్ మైలేజ్ కారణంగా ఈ మోడల్ ట్యాక్సీ డ్రైవర్లలో బాగా ప్రాచుర్యం పొందింది.
మారుతి వ్యాగనార్ ట్యాక్సీ మోడల్ అయిన టూర్ H3పై రూ.40,000 వరకు ఆఫర్లు ఇస్తున్నారు. ఇది క్యాబ్, ఫ్లీట్ ఆపరేటర్లకు చాలా చౌకైన ఆప్షన్‌గా మారింది. ఈ కారు సిటీ, హైవే ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.
55
కొనుగోలుదారులకు గమనిక
మారుతి సుజుకి వ్యాగనార్ పై డిస్కౌంట్ అనేది వేరియంట్, నగరం, డీలర్‌షిప్‌ను బట్టి మారవచ్చు. కాబట్టి కారును బుక్ చేసుకునే ముందు పూర్తి ఆఫర్ వివరాల కోసం మీ దగ్గరలోని మారుతి డీలర్‌ను సంప్రదించడం మంచిది. ఈ ఆఫర్లు మీ బడ్జెట్‌కు బాగా సహాయపడతాయి.