పెరుగుతున్న ఇంధన ధరల భారం కారణంగా ప్రజలు అధిక మైలేజీ గల బైకులనే ఇష్టపడుతున్నరు. దేశంలో విక్రయించబడుతున్న అత్యధిక మైలేజ్ గల టాప్ 5 బైకుల గురించి తెలుసుకుందాం..
హీరో స్ప్లెండర్ ప్లస్ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ నుండి అత్యధికంగా అమ్ముడైన హీరో స్ప్లెండర్ ప్లస్ చాలా ప్రసిద్ది చెందింది. హీరో స్ప్లెండర్ ప్లస్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్‌ఏఐ) ధృవీకరించి ప్రకారం లీటరుకు 80 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ 97.2 సిసి ఇంజన్ తో, 8.01 పిఎస్ శక్తిని, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ ఇంకా కిక్ స్టార్ట్ అనే రెండు వేరియంట్లలో వస్తుంది. ఈ పాపులర్ బైక్‌ను 4 కలర్ స్కీమ్‌తో కంపెనీ అందిస్తుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ కిక్ స్టార్ట్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఢీల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ .62,535.
హీరో సూపర్ స్ప్లెండర్హీరో మోటోకార్ప్ చెందిన మరో బైక్ హీరో సూపర్ స్ప్లెండర్ టాప్ 5 మైలేజ్ బైకులలో ఒకటి. ఇది 125 సిసి ఇంజన్ బైక్. హీరో సూపర్ స్ప్లెండర్ బైక్ ధర ఢీల్లీలో 71,100 ఎక్స్ షోరూమ్. దీని ప్రీమియం డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.74,600
బజాజ్ ప్లాటినా 110పూణేకు చెందిన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో చెందిన బజాజ్ ప్లాటినా 100 తక్కువ బడ్జెట్‌లో అధిక మైలేజీని అందించే బైకుగా ఎంతో పేరుగాంచింది. ఇది 100 సిసి బైక్, ఏఆర్‌ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ లీటరుకు 84 కి.మీ. బజాజ్ ప్లాటినా 102 సిసి ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 7.9 పిఎస్ శక్తిని, 8.3 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. బజాజ్ ప్రకారం డిస్క్ బ్రేక్ పొందే 100 సిసి బైక్ ప్లాటినా మాత్రమే. వీటితో పాటు ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ (డే-టైమ్ రన్నింగ్ లైట్స్) కూడా ఈ బైక్‌లో లభిస్తుంది. బజాజ్ ప్లాటినా 100 ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర 59,859 రూపాయలు.
టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ కూడా టాప్ 5 మైలేజ్ బైక్‌లలో బెస్ట్ ఆప్షన్. ఈ బైక్ ఏఆర్‌ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ 86 కిమీ లీ. 110 సిసి ఇంజన్ గల టివిఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్ 8 బిహెచ్‌పి శక్తిని అందిస్తుంది. ఈ బైక్ సింగిల్ టోన్ ఇంకా డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌లతో కిక్ స్టార్ట్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్ తో లభిస్తుంది. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్ ఢీల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ .65,865.
బజాజ్ సిటి100దేశంలో అత్యంత బడ్జెట్ గల 100 సిసి బైక్ బజాజ్ సిటి100. బజాజ్ ఎంట్రీ లెవల్ కమ్యూటర్ బైక్ లీటరుకు 90 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ బైక్ కి 102 సిసి ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 7.9 పిఎస్ శక్తిని, 8.34 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఈ బడ్జెట్ బైక్‌ను మూడు రంగులలో అందిస్తుంది. ఇందులో నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులు ఉన్నాయి. బజాజ్ సిటి 100 బైక్ అల్లాయ్ వీల్స్ కిక్ స్టార్ట్ వేరియంట్ ఢీల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ .49,152.