హెవీ డ్యూటీ, కంఫర్ట్ కోసం ఇసుజు ఎంట్రీ లెవల్ కొత్త పిక్-అప్ ట్రక్కులు.. బిఎస్ -6 వెర్షన్‌తో లాంచ్..

First Published May 11, 2021, 11:47 AM IST

జపాన్ వాహన తయారీ సంస్థ ఇసుజు మోటార్స్  తాజాగా  మూడు వేరియంట్లను భారతదేశంలో విడుదల చేసింది. వీటిలో ఒకటి సరికొత్త మోడల్ తో పాటు పపౌలర్ పికప్ ట్రక్కులు డి-మాక్స్ వి-క్రాస్,  ఎంయు-ఎక్స్ ఎస్‌యూవీలను బిఎస్ -6 వెర్షన్‌తో అప్‌డేట్ చేశారు. అంతేకాకుండా కొత్త ఎంట్రీ లెవల్ పిక్-అప్ మోడల్ హై-లాండర్ ను కూడా కంపెనీ విడుదల చేసింది.

కొత్త ఎంట్రీ లెవల్ పికప్ హై-లాండర్కొత్త ఎంట్రీ లెవల్ డి-మాక్స్ హై-లాండర్ మోడల్ చెన్నై ఎక్స్-షోరూమ్ ధర రూ .16.98 లక్షలకు విడుదల చేసింది. ఇసుజు హాయ్-లాండర్ 1.9-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 163 హెచ్‌పి శక్తిని, 360 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అందించారు. 4-వీల్ డ్రైవ్ సిస్టమ్ ను హై-ల్యాండర్ పికప్‌లో అందించారు, అయితే దీనికి మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఈ ఎంట్రీ లెవల్ పికప్‌ ట్రక్కుకి హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ ఓ‌ఆర్‌వి‌ఎంలు, స్టీల్ వీల్స్ ఉన్నాయి.
undefined
ఇసుజు వి-క్రాస్ఇసుజు వి-క్రాస్ 4 ఎక్స్ 2 జె మాన్యువల్ ధర రూ .19.98 లక్షలు. 4x4 జే మాన్యువల్ ధర రూ.20.98 లక్షలు, టాప్ మోడల్ 4x4 ఆటోమేటిక్ జె ప్రెస్టీజ్ ధర రూ.24.49 లక్షలు. ఈ ధరలు అన్నీ చెన్నై ఎక్స్-షోరూమ్ చెందినవి.
undefined
ఫీచర్స్ గురించి మాట్లాడితే వి-క్రాస్ టాప్ మోడల్‌లో 6-ఎయిర్‌బ్యాగులు, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 6-వే అడ్జస్ట్ డ్రైవర్ సీట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి.
undefined
ఇసుజు ఎం‌యూ-ఎక్స్ఈ 7 సీట్ల ఎస్‌యూవీ ఇసుజు ఎంయు-ఎక్స్‌ను రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టారు. ఇందులో 2-వీల్ డ్రైవ్, 4-వీల్ డ్రైవ్ ఉన్నాయి. రెండు వేరియంట్లలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్, సింగిల్ 1.9-లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజిన్ 163 బి‌హెచ్‌పి శక్తిని, 360 ఎన్‌ఎం గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇచ్చారు. దీనితో పాటు తక్కువ-శ్రేణి గేర్‌బాక్స్‌తో వచ్చే 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను పొందుతుంది. ఇసుజు ఎంయు-ఎక్స్ ఎస్‌యూవీ చెన్నై ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ .33.37 లక్షలు. 4-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ.35.34 లక్షలు.
undefined
ఈ ఎస్‌యూవీలో ఇంజన్‌ను మాత్రమే కంపెనీ అప్‌డేట్ చేసింది. అంతేకాకుండా ఇందులో ఎలాంటి ఇతర మార్పులు చేయలేదు. భారతీయ మార్కెట్లో ఈ ఎస్‌యూవీ టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ వంటి ఎస్‌యూవీలతో పోటీపడుతుంది.
undefined
undefined
click me!