ఈ కారు ధర అక్షరాలా ఎన్ని కొట్లో తెలుసా.. ఫస్ట్ బుక్ చేసుకునే వారికే ఛాన్స్ ! చూస్తే మైండ్ బ్లాక్..

First Published | Aug 24, 2023, 7:32 PM IST

బ్రిటిష్ ఏరో స్పీడ్ కంపెనీ రోల్స్ రాయిస్ కొత్త కారును లాంచ్ చేసింది. మీరు దాని ధర విన్న తర్వాత కోనాలని నిర్ణయించుకుంటే, మీరు వెంటనే ఓ పని  చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక లిమిటెడ్ ఎడిషన్ కారు. దీని పేరు రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్(La Rose Noir). ఈ కారు ధర అక్షరాలా 211 కోట్ల రూపాయలు. అసలు ఈ కారులో ఏముంది, ఎలా ఉంటుంది, ఎందుకు ఇంత ధర ఉందొ చూద్దాం... 
 

భారతదేశంలో ఖరీదైన కార్లకు కొదవలేదు. ప్రతిరోజు  కోట్ల రూపాయల కార్లలో తిరిగే ధనవంతులు ఎందరో. మన ఇండియన్ రోడ్లపై రూ.10 కోట్ల కార్లు, అంతకంటే ఎక్కువ ధర గల మోడిఫైడ్  కార్లు కనిపించడం ఈ రోజుల్లో మామూలే... 
 

భారతదేశంలోని అత్యంత ఖరీదైన కార్లలో బ్రిటిష్ కారు రోల్స్ రాయిస్ కల్లినన్ కూడా ఒకటి. దీని ధర దాదాపు 10 కోట్ల రూపాయల అంచనా. అయితే ఇప్పుడు దాని అన్ని రికార్డులు బద్దలు కొట్టిన కారు విడుదలైంది. అదే రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్.
 


సరికొత్త రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ కారు లిమిటెడ్ ఎడిషన్ కారు. అంటే నాలుగు కార్లు మాత్రమే ఉత్పత్తి చేసి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ కారు లభిస్తుంది.
 

ఇదొక మాస్టర్‌పీస్ బిల్ట్ కార్. అయితే దీని ధర 211 కోట్ల రూపాయలు. ఏదైనా కారు బుక్ చేసుకున్న వారికి  డమ్మీ తాళం ఇచ్చి ఒక ఫోస్ తో కార్ డెలివరీ చేయడం అంత పెద్ద  విషయం  కాదు. కానీ రోల్స్ రాయిస్ ఈ కార్ ఓనర్ల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
 

ఈ కారును బాకరట్ రోజ్ ఫ్లవర్(Baccarat rose flower) స్ఫూర్తితో ఫ్రాన్స్ డిజైన్ చేసింది. ఈ కారు ఎన్నో రంగుల్లో లభ్యం కానుంది. ముందు నుంచి చూస్తే ఒక రంగు, వెనుక నుంచి చూస్తే మరో రంగుల కనిపిస్తుంది.
 

ఈ కారు వెనుక దాదాపు 2 సంవత్సరాల కృషి ఉంది. ప్రతి ఎలిమెంట్  చర్చించబడింది, అభివృద్ధి చేయబడింది, సమీక్షించబడింది, పరీక్షించబడింది ఇంకా ఉత్పత్తి చేయబడింది. ఇందులో ట్విన్ టర్బో ఛార్జ్డ్ 6.75 లీటర్ ఇంజన్ ఉంది. 
 

ఈ కారు 601 హెచ్‌పి పవర్ అండ్  840 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. లా రోజ్ నోయిర్ కారు టాప్ స్పీడ్  గంటకు 250 కి.మీ.
 

ఈ కారులో రివర్సిబుల్ రూఫ్, ఎలక్ట్రోక్రోమిక్ గ్రాస్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో కూడా ఎన్నో ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
 

Latest Videos

click me!