పండగ సీజన్ లో రానున్న 5 కొత్త కార్లు.. .!! బుకింగ్, ఫీచర్స్, స్పెషాలిటీ, ధర ఎంతో తెలుసా..?

First Published | Aug 24, 2023, 1:33 PM IST

ఈ పండుగ సీజన్‌లో 5 కొత్త SUVలు విడుదల కానున్నాయి. చాల కాలంగా కొత్త కార్ కొనేందుకు ప్లాన్ చేస్తున్న వారు వీటిపై ఓ లుక్కేయవచ్చు. 
 

హోండా ఎలివేట్

ఈ కారు హోండా సిటీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది కొన్ని నెలల క్రితం భారతదేశంతో  ప్రపంచవ్యాప్త అరంగేట్రం చేసింది. హోండా ఇప్పటికే ఈ  SUV  భారీ ఉత్పత్తిని మొదలుపెట్టింది ఇంకా  బుకింగ్‌లను రూ. 5,000తో ప్రారంభించింది. సెప్టెంబరులో నుండి సేల్స్ ఉంటాయి,  దీని ధర రూ. 11 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని అంచనా.


ఈ కాంపాక్ట్ సెడాన్ 1.5-లీటర్ పెట్రోల్ పవర్‌ట్రెయిన్ (121PS/145Nm),  6-స్పీడ్ మాన్యువల్ అండ్ CVT గేర్  ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, సింగిల్-పేన్ సన్‌రూఫ్ అండ్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీలో  ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్లు, రెండు కెమెరాలు (లెఫ్ట్ ORVM ఇంకా ఇతర బ్యాక్ పార్కింగ్ యూనిట్) ఉన్నాయి.
 

సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్

సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్ తర్వాత ఫ్రెంచ్ మార్కెట్‌లో సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ రెండవ SUV ఇది. ఈ  C3 క్రాస్ఓవర్-హ్యాచ్‌బ్యాక్   అదే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. దీని బుకింగ్‌లు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి, అక్టోబర్‌లో లాంచ్  కానుంది. దీని ధర రూ. 11 లక్షలు (ఎక్స్-షోరూమ్).

C3 ఎయిర్‌క్రాస్  కూడా అదే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. 110PS అండ్ 190Nm ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి  6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ మాత్రమే జత చేసారు. ఇందులో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, మాన్యువల్ AC వంటి  అంశాలు ఉన్నాయి. సేఫ్టీ  విషయంలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్సింగ్ కెమెరా అండ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి.


టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్

రాబోయే రెండు నెలల్లో  మనం  రివాజ్డ్ టాటా నెక్సాన్‌ను చూస్తాము. దీనిని  చాలాసార్లు  టెస్టింగ్ కూడా చేయబడింది.  లేటెస్ట్ స్పై షాట్‌లు దీని ప్రొడక్షన్ కి సిద్ధంగా ఉందని సూచిస్తున్నాయి. అప్ డేటెడ్  టాటా నెక్సాన్ ధరలు రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయని అంచనా.

టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ (సబ్-4m SUV  సెకండ్  మేజర్ మిడ్‌లైఫ్ అప్‌డేట్) కొత్త డిజైన్‌ను పొందుతుంది. కొత్త 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్‌ తో  ప్రస్తుత మోడల్ నుండి అదే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ను పొందుతుందని భావిస్తున్నారు. వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ ఇంకా ఫుల్  డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఫీచర్లు, టాటా 360-డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు,  ISOFIXతో వస్తుంది.

టాటా నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్

కొత్త Nexon EV  కార్ నెక్సాన్ కొత్త మోడల్‌లో విక్రయించబడుతుందని చెప్తున్నారు. దీని ధర రూ. 15 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాటా అప్ డేటెడ్  నెక్సాన్ EVని ఇంతకుముందు ఉన్న రెండు వేరియంట్‌లలో అందిస్తుంది. ప్రైమ్ (30.2kWh బ్యాటరీ ప్యాక్; 312km పరిధి), మ్యాక్స్ (40.5kWh బ్యాటరీ ప్యాక్; 453km పరిధి). 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, బ్యాటరీ రిజనరేషన్ కోసం ప్యాడిల్ షిఫ్టర్‌లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్,  క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరాను అందించడంతో   సేఫ్టీ మెరుగుపరచవచ్చు.
 

5-డోర్ల పోర్స్చే గూర్ఖా

5-డోర్ల పోర్స్చే గూర్ఖా చాలా కాలం నుండి రాబోతున్న  ఉన్న SUV. దీని టెస్టింగ్  2022 ప్రారంభంలో ప్రారంభమైంది. ఈ పండుగ సీజన్‌లో   రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విక్రయించనున్నట్లు  భావిస్తున్నారు. వీటిలో రివైజ్డ్ లైటింగ్ సిస్టమ్ ఇంకా పెద్ద 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. దీనిని 3-డోర్ మోడల్‌లో అందించబడింది.

5-డోర్ల పోర్స్చే గూర్ఖా అదే 2.6-లీటర్ డీజిల్ ఇంజన్ (90PS/250Nm)తో వచ్చే అవకాశం ఉంది. కానీ మరింత ట్యూన్ చేయబడిన స్టేటస్ లో ఉండవచ్చు. అదే 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్,  4-వీల్ డ్రైవ్ ట్రైన్ స్టాండర్డ్‌గా వస్తుందని భావిస్తున్నారు. 7-అంగుళాల టచ్‌స్క్రీన్, మొదటి ఇంకా  రెండవ వరుస పవర్ విండోలు  ఉంటాయి.

Latest Videos

click me!