టెస్లా ఇండియాలోనే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలి.. అప్పుడు మీకు పన్ను ప్రయోజనాలు..: నీతి ఆయోగ్

First Published Oct 23, 2021, 12:24 PM IST

 ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకం తగ్గించాలని అమెరికాలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా (tesla) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్యాలయాన్ని(pmo)అభ్యర్ధించింది. ఈ నివేదిక  వెలువడిన ఒక రోజు తర్వాత నీతి ఆయోగ్ భారతదేశంలో తయారీని ప్రారంభించాలని కార్ల తయారీ సంస్థ కోరింది అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి పన్ను ప్రయోజనాలపై హామీ ఇచ్చింది. 
 

నీతి ఆయోగ్(niti aayog) వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ గురువారం జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ  "భారతదేశానికి ఎలక్ట్రిక్ కార్ల(electric cars)ను ఎగుమతి చేసేందుకు సి‌బి‌యూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గాన్ని ఎంచుకోవద్దని టెస్లాను కోరారు. దీనికి బదులుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి సహాయపడే ఒక తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను సృష్టించాలి. రండి, భారతదేశంలో తయారు చేయండి, మీరు (టెస్లా) మీకు కావలసిన అన్ని పన్ను ప్రయోజనాలను పొందుతారు" అని అన్నారు
 

 పిఎంఒ విజ్ఞప్తి
  కార్ల తయారీ సంస్థ, సి‌ఈ‌ఓ ఎలోన్ మస్క్(elon musk) భారతదేశంలో ఈ పన్ను చాలా ఎక్కువగా ఉందని, ఇటీవలి నివేదికల ప్రకారం క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో అధిక పన్నుకు సంబంధించి కంపెనీ ఆందోళనలను తెలియజేయడానికి సెప్టెంబర్‌లో టెస్లా ఎగ్జిక్యూటివ్‌లు పి‌ఎం అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు.
 

టెస్లా  వాదన 
టెస్లా కస్టమ్స్ డ్యూటీతో సంబంధం లేకుండా ఎలక్ట్రిక్ కార్లపై ప్రామాణిక పన్నును 40 శాతానికి పెంచాలని కోరింది . దీనితో పాటు ఎలక్ట్రిక్ కార్లపై 10 శాతం సోషల్ వెల్ ఫేర్ సర్‌ఛార్జ్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ కూడా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను 40 శాతం తగ్గించడం వలన వాటిని మరింత సరసమైన ధరకు ఇంకా అమ్మకాలను పెంచుతుందని టెస్లా ప్రభుత్వంతో వాదించింది. 

పన్ను తగ్గింపులను పరిశీలిస్తే
మీడియా నివేదికల ప్రకారం కారు ధర, ఇన్సూరన్స్ సహా $ 40,000 (సుమారు రూ. 30 లక్షలు) కంటే తక్కువ విలువ కలిగిన దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాల కోసం పన్ను రేటును 60 శాతం నుండి 40 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం చర్చిస్తోంది. $40,000 కంటే ఎక్కువ ఖరీదు చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం పన్నును 100 శాతం నుండి 60 శాతానికి తగ్గించడాన్ని పరిగణించవచ్చు. 

స్థానిక ప్లాంట్‌పై మస్క్ ప్రకటన 
ఈ ఏడాది ప్రారంభంలో అధిక పన్నుపై ఆందోళన వ్యక్తం చేసిన మొదటి వ్యక్తి ఎలోన్ మస్క్. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో మస్క్ మాట్లాడుతూ, వాహన దిగుమతుల్లో కంపెనీ విజయవంతమైతే భారతదేశంలో స్థానిక ఫ్యాక్టరీ  అవకాశం ఉందని అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు ఎక్కువగా ఉందని అన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలనే ఎలోన్ మస్క్ డిమాండ్‌పై దేశీయ తయారీదారులు నిరసన వ్యక్తం చేశారు, దీంతో భారతదేశంలో ఉన్న కార్ల తయారీదారులలో చర్చకు దారితీసింది. టెస్లా  డిమాండ్‌లకు మెర్సిడెస్, హ్యుందాయ్ కూడా మద్దతు చేసింది. దేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే టాటా మోటార్స్ వంటి వాహన తయారీ సంస్థలు నిరసన వ్యక్తం చేశాయి. 
 

click me!