ఆనంద్ మహీంద్రా అరకు కాఫీ డైరెక్టర్ల బోర్డులో ఉన్నాడు - అరకు కాఫీ ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన యువతకు ఉపాధి అవకాశాలను అందించడానికి స్థాపించబడిన బ్రాండ్. ఒకప్పటి నుండి ప్రపంచ గుర్తింపును గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్‌ని ప్రోత్సహించే చొరవను నాంది ఫౌండేషన్ ముందుండి నడిపించింది , దీనిలో ఆనంద్ మహీంద్రా కూడా డైరెక్టర్‌గా ఉన్నారు.
ఆనంద్ మహీంద్రా ట్వీట్‌లో "@naandi_india & @arakucoffeeinలో మనమందరం చాలా గర్వపడుతున్నాము!" - అంటూ కేఫ్‌ను సూచించారు.
దీనికి ప్రతిస్పందనగా ఓలా సిఈఓ అగర్వాల్ తాను ఈ కేఫ్‌లోకి తరచూ వస్తుంటానని అని చెప్పాడు. అలాగే అతను అక్కడి సర్వీస్, కాఫీని కూడా ప్రశంసించాడు: "నేను ఇప్పటికే అత్యంత రెగ్యులర్ కస్టమర్ సార్! గొప్ప బ్రాండ్, ప్రాడక్ట్ అండ్ సర్వీస్." అంటూ రిట్వీట్ చేశారు.