ఇంటీరియర్ గురించి మాట్లాడితే దీనిలో ఒక పెద్ద సౌకర్యవంతమైన క్యాబిన్‌ను పొందుతుంది, ఇందులో ఐదుగురు వ్యక్తులు కూర్చోవచ్చు. టాప్ వేరియంట్‌లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్లోటింగ్ డిస్‌ప్లే యూనిట్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ లభిస్తాయి. అంతే కాకుండా పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, కప్ హోల్డర్‌లతో బ్యాక్ ఆర్మ్‌రెస్ట్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో ఏబిఎస్, బ్యాక్ పార్కింగ్ కెమెరా ఉంటాయి. ఈ విభాగంలో మొదటిసారిగా టాటా పంచ్ హిల్ డిసంట్ కంట్రోల్ తో ఇసుక, మట్టి, రాక్ ట్రాక్షన్ మోడ్‌లను పొందుతుంది.