ఆస్టర్‌లో ఎడిఎఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్స్) ఎంజి బోష్ (bosch)తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఎఐ టెక్నాలజీ, ఆరు రాడార్లు, ఐదు కెమెరాల ఎక్విప్మెంట్ 14 అడ్వాన్స్డ్ అటానమస్ లెవల్ 2 ఫీచర్లను ఎస్‌యూవి మానేజ్ చేస్తాయి. ఇఎస్‌పి, టిసిఎస్, హెచ్‌డిసి వంటి 27 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో ఈ కారు సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. కంఫర్ట్, సౌలభ్యం, భద్రతా ఫీచర్లలో 6 ఎయిర్‌బ్యాగులు, 6-వే పవర్- అడ్జస్ట్ డ్రైవర్ సీట్లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హీటెడ్ ఓఆర్ విఎం, రెయిన్-సెన్సింగ్ వైపర్, పిఎం 2.5 ఫిల్టర్, పనోరమిక్ స్కై రూఫ్, బ్యాక్ ఎసి వెంట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మ్‌రెస్ట్, మూవీ ఎక్స్పీరియన్స్ కోసం 10.1-అంగుళాల హెచ్‌డి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల ఎంబెడెడ్ ఎల్ సిడి స్క్రీన్‌తో పూర్తి డిజిటల్ క్లస్టర్ ఇచ్చారు.