Tata Punch EV: మార్కెట్లో దుమ్మురేపుతున్న టాటా పంచ్ ఈవీ ఫేస్ లిస్ట్..సేఫ్టీలోనూ ది బెస్ట్

Published : Aug 01, 2026, 05:57 PM IST

Tata Punch EV: భారత ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV విభాగంలో ఆదరణ పొందుతున్న టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ మరో కీలక ఘట్టాన్ని చేరుకుంది. పనితీరుతో పాటు భద్రత విషయంలోనూ ఈ మోడల్ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.

PREV
15
టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్

భారత ఎలక్ట్రిక్ కాంపాక్ట్ SUV విభాగంలో ఆదరణ పొందుతున్న టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ మరో కీలక ఘట్టాన్ని చేరుకుంది. పనితీరుతో పాటు భద్రత విషయంలోనూ ఈ మోడల్ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. టాటా మోటార్స్ వారి పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ మోడల్, ఇటీవల జరిగిన భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించి కొత్త రికార్డ్ సృష్టించింది. ఈ రేటింగ్ టాప్ వేరియంట్‌కే కాదు, అన్ని వేరియంట్లకు వర్తిస్తుందని భారత్ NCAP స్పష్టం చేసింది. Adult Safety విభాగంలో ఈ కారు 32 పాయింట్లకు గాను 31.09 పాయింట్లు సాధించింది.

25
సేఫ్టీ ముఖ్యం

పిల్లల భద్రత పరంగా కూడా టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఆకట్టుకునే ఫలితాలు సాధించింది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 49 పాయింట్లలో 45 పాయింట్లు దక్కించుకుంది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ క్రాష్ పరీక్షలో 16లో 15.28 పాయింట్లు, సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో 15.80 పాయింట్లు సాధించి, ప్రమాదాల సమయంలో చిన్న పిల్లలకు రక్షణ కల్పిస్తుంది.

35
చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్
అంతేకాదు, ఈ కారు సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసింది. పిల్లల భద్రత విషయంలోనూ పంచ్ ఈవీ అద్భుతంగా పనిచేసింది. చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్ (CRS) టెస్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ అమర్చడంలోనూ అత్యధిక స్కోర్ సాధించింది. దీంతో, కుటుంబాలకు అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా పంచ్ ఈవీ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
45
భద్రతా ఫీచర్లు
సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే, అన్ని వేరియంట్లలోనూ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), సైడ్ అండ్ కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్‌లు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, పాదచారుల భద్రతా ఫీచర్లు వంటివి స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. దీనివల్ల, అదనపు భద్రతా ఫీచర్ల కోసం టాప్ వేరియంట్లను ఎంచుకోవాల్సిన అవసరం చాలా వరకు తగ్గింది.
55
ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
2024లో టెస్ట్ చేసిన పంచ్ ఈవీతో పోలిస్తే, పెద్దల భద్రత స్కోర్‌లో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ, పిల్లల భద్రత స్కోర్ మాత్రం పటిష్టంగానే ఉంది. మొత్తంగా, టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్, ఇండియాలోని చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో భద్రతా ఫీచర్లలో అగ్రగామి మోడళ్లలో ఒకటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
Read more Photos on
click me!

Recommended Stories