టాటా మోటార్స్ కార్లపై బంపర్ డిస్కౌంట్.. ఈ మోడళ్లపై భారీగా తగ్గింపు.. కొద్దిరోజులే ఛాన్స్..

First Published | Dec 7, 2021, 7:43 PM IST

 హ్యుందాయ్, హోండా తర్వాత ఇప్పుడు టాటా మోటార్స్(tata motors) కూడా డిసెంబర్ నెలలో కార్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ తగ్గింపులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ అండ్ లాయల్టీ డిస్కౌంట్ రూపంలో అందించనుంది.  అయితే టాటా  కంపెనీ  టాటా నెక్సన్ (Nexon), టియాగో(Tiago), హారియర్( Harrier), సఫారి (Safari) వంటి మోడళ్లపై ఈ తగ్గింపును అందిస్తోంది. 

అలాగే వచ్చే నెల నుండి కంపెనీ వాణిజ్య వాహనాల ధరలను 2.5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.  ఏ మోడల్‌పై ఎంత డిస్కౌంట్ ఇస్తుందో తెలుసుకుందాం... 

టాటా నెక్సాన్
టాటా నెక్సాన్ ధర రూ.7.30 లక్షల నుండి మొదలై రూ.13.35 లక్షల వరకు ఉంటుంది. ఇందులో పెట్రోల్ వెర్షన్‌ ధరలు  రూ.7.30 లక్షల నుండి రూ.12.00 లక్షలు  ఉంటుంది అలాగే డీజిల్ వెర్షన్ రూ. 8.60 లక్షల నుండి రూ.13.35 లక్షల మధ్య ఉంటుంది. నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూ‌విల డార్క్ ఎడిషన్ శ్రేణి మినహా అన్ని డీజిల్ వేరియంట్‌లపై రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తుంది.
 

టాటా హారియర్
 టాటా హారియర్ ధర రూ.14.39 లక్షల నుండి మొదలై రూ.21.19 లక్షల వరకు ఉంటుంది. హారియర్ డీజిల్ వెర్షన్ ధర రూ.14.39 లక్షల నుండి రూ.21.19 లక్షల మధ్య ఉంటుంది. ఈ నెలలో మీకు టాటా హారియర్ డార్క్ శ్రేణిపై రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందించనుంది. అంతేకాకుండా ఇతర వేరియంట్లపై రూ. 40,000 ఎక్స్చేంజ్ తగ్గింపు అందిస్తుంది. 


టాటా టియాగో
దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా టియాగో ప్రారంభ హ్యాచ్‌బ్యాక్‌పై రూ. 10,000 నగదు తగ్గింపు అలాగే రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను ఆఫర్ చేసింది. దీనితో పాటు XT అండ్ XT(O) ట్రిమ్‌లపై  రూ. 10,000 నగదు తగ్గింపు ఇంకా రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అందిస్తుంది. ఈ కాంపాక్ట్ సెడాన్‌పై రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ కూడా ఉంది. 


టాటా సఫారి
 టాటా సఫారి ధర రూ.14.99 లక్షల నుండి మొదలై రూ.23.19 లక్షల వరకు ఉంటుంది. టాటా సఫారీ 20 వేరియంట్లలో అందుబాటులో ఉంది. సఫారి బేస్ మోడల్ XE అండ్ టాప్ వేరియంట్ టాటా న్యూ సఫారి XZA Plus గోల్డ్ ధర  రూ. 23.19 లక్షలు.

సఫారీపై కూడా కంపెనీ మీకు రూ. 40000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. అయితే దీని గోల్డ్ ఎడిషన్‌పై ఎలాంటి ఆఫర్ ఉండదు. ఈ అన్ని ఆఫర్‌ల ప్రయోజనం 31 డిసెంబర్ 2021 వరకు మాత్రమే.
 

వాణిజ్య వాహనాల ధరల పెంపు
డిస్కౌంట్ ముగింపు తర్వాత టాటా మోటార్స్ 1 జనవరి  2022 నుండి వాణిజ్య వాహనాల ధరలను 2.5% పెంచుతున్నట్లు ప్రకటించింది. టాటా పెంపు మిడ్  అండ్ హెవీ కమర్షియల్ వాహనం (M&HCV), మీడియం అండ్ లైట్ కమర్షియల్ వాహనం (I&LCV), స్మాల్ కమర్షియల్ వాహనం (SCV) అలాగే బస్సులకు వర్తిస్తుంది. మోడల్ అండ్ వేరియంట్‌ను బట్టి వాటి ధర మారుతుంది.

Latest Videos

click me!