BMW ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.2 లక్షల భారీ డిస్కౌంట్

Published : Feb 23, 2026, 05:39 PM IST

BMW CE 02 Price Cut : బీఎండబ్ల్యూ మోటోరాడ్ తన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ CE 02 పై రూ. 2 లక్షల వరకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ప్రీమియం స్కూటర్ పై అందిస్తున్న భారీ డిస్కౌంట్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
BMW : ఎలక్ట్రిక్ బైక్ లవర్స్‌కు పండగే.. సగానికి సగం తగ్గిన బీఎండబ్ల్యూ స్కూటర్ రేటు

ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) మోటోరాడ్ ఇండియా తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీకి చెందిన ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ BMW CE 02 పై భారీ స్థాయిలో ధరలను తగ్గించింది. గత ఏడాది చివరలో భారత మార్కెట్లోకి విడుదలైన ఈ స్కూటర్, ఆశించిన స్థాయిలో విక్రయాలను నమోదు చేయకపోవడంతో డీలర్‌షిప్ స్థాయిలో ఈ భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. దాదాపు రూ. 4.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ అయిన ఈ మోడల్‌పై ఇప్పుడు ఏకంగా రూ. 2 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది.

25
ఆశించిన స్థాయిలో లేని అమ్మకాలు.. భారీ తగ్గింపు

బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా 2024 చివరి నెలల్లో CE 02 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా లాంచ్ చేసింది. అయితే, దీని అధిక ధర కారణంగా భారత మార్కెట్లో పోటీని తట్టుకోలేకపోయింది. దీంతో స్టాక్ క్లియర్ చేసేందుకు డీలర్లు భారీ ఆఫర్లను ప్రకటించారు. ముంబై వంటి నగరాల్లో బేస్ వేరియంట్ ధర ఆన్-రోడ్ రూ. 2.50 లక్షలకే అందుబాటులో ఉంది. అలాగే బెంగళూరులో హైలైన్ ట్రిమ్ ధర రూ. 3 లక్షలుగా (ఆన్-రోడ్) ఉంది. ఈ తగ్గింపు తర్వాత, ఇది ఏథర్ 450 అపెక్స్ (Ather 450 Apex), టీవీఎస్ ఎక్స్ (TVS X) వంటి స్కూటర్ల ధరలకు చేరువలో ఉండటం విశేషం.

35
BMW CE 02 పవర్, బ్యాటరీ సామర్థ్యం ఎంత?

సాంకేతిక పరంగా ఈ స్కూటర్ అత్యుత్తమ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో 3.92 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీనిని ఒకసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 108 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 15 హార్స్ పవర్ (11 kW), 55 న్యూటన్ మీటర్ల గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గంటకు 95 కిలోమీటర్ల వరకు వేగంతో దీనిపై ప్రయాణించవచ్చు. సాధారణ 950 W ఛార్జర్‌తో దీనిని 5 గంటల్లో పూర్తి ఛార్జ్ చేయవచ్చు. ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే కేవలం 3.5 గంటల్లోనే ఛార్జింగ్ పూర్తవుతుంది.

45
అద్భుతమైన డిజైన్, అధునాతన ఫీచర్లు

BMW CE 02 డిజైన్ పరంగా స్కూటర్, మోటార్‌సైకిల్ కలయికగా కనిపిస్తుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, టర్న్ సిగ్నల్స్ ఉన్నాయి. సీటు ఎత్తు 745 mm ఉంటుంది, అయితే లగేజీ స్పేస్, వెనుక కూర్చునే ప్రయాణికుడికి స్థలం కొంత తక్కువగా ఉంటుంది. హైలైన్ వేರಿయంట్‌లో గోల్డ్ అనోడైజ్డ్ యూఎస్డీ ఫోర్క్, హీటెడ్ గ్రిప్స్, స్మార్ట్‌ఫోన్ హోల్డర్, ఫ్లాష్ రైడింగ్ మోడ్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

55
మేడ్ ఇన్ ఇండియా.. మేడ్ బై టీవీఎస్

ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న టీవీఎస్ (TVS) ప్లాంట్‌లో తయారవుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 4,400 కంటే ఎక్కువ యూనిట్లు ఇక్కడి నుండి ఎగుమతి అయ్యాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ భారీ డిస్కౌంట్ అధికారికంగా కంపెనీ ప్రకటించింది కాదని, కేవలం డీలర్‌షిప్ స్థాయిలో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుందని గమనించాలి. కాబట్టి ఆసక్తి గల వారు సమీపంలోని బీఎండబ్ల్యూ మోటోరాడ్ షోరూమ్‌ను సంప్రదించడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories