అయితే ఇప్పుడు టెస్లా మోడల్ ఎస్ సెడాన్ కారు యజమాని తన ఖరీదైన ఎలక్ట్రిక్ సెడాన్ కారును 30 కిలోల డైనమైట్‌తో పేల్చివేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ ఉదంతం ఫిన్లాండ్‌లో వెలుగులోకి వచ్చింది.
2013 టెస్లా మోడల్ S ఎలక్ట్రిక్ సెడాన్ కారు యజమాని టుమాస్ కటైనెన్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) కంపెనీ టెస్లా సర్వీస్‌తో నిరాశ చెంది తన కారును పేల్చివేసాడు. నిజానికి తన టెస్లా మోడల్ S కారు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కనిపించే మల్టీ ఎర్రర్ కోడ్‌లో లోపం ఏర్పడింది. దీంతో ఈ సెడాన్ కారును టెస్లా సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లరు. నెల రోజుల పాటు వేచి ఉన్న తర్వాత, కారు యజమానికి EV కంపెనీ నుండి ఒక సమాచారం అందింది, ఏంటంటే మొత్తం బ్యాటరీ ప్యాక్‌ను మార్చకుండా ఈ సెడాన్ కారును రిపేర్ చేయడం సాధ్యం కాదని, దీని కోసం 22,480డాలర్లు అంటే సుమారు రూ. 17,08,783 ఖర్చవుతుందని తెలిపారు.