విశేషం ఏంటంటే బుకింగ్ మొదటి రోజు గంటలోపు 25,000 యూనిట్లు ఆర్డర్ అయ్యాయి అలాగే మరుసటి రోజు రెండు గంటల్లో 25,000 కంటే ఎక్కువ బుకింగులు వచ్చాయి. దీంతో మహీంద్రా సరికొత్త రికార్డును నెలకొల్పడమే కాకుండా, లాక్ డౌన్ సమయంలో దేశంలోని మొత్తం ప్యాసింజర్ వాహన విభాగం మొదటిసారిగా పతనాన్ని చూసింది.
మహీంద్రా XUV700ని రూ. 11.99 లక్షలకు విడుదల చేయగా, తర్వాత బుకింగ్‌ల కోసం ధరలు రూ. 12.49 లక్షలకు పెంచింది, అయితే టాప్ స్పెక్ మోడల్ ధర రూ. 22.99 లక్షలు. ప్రస్తుతం, మహీంద్రాకి 75,000 యూనిట్లకు పైగా ఆర్డర్‌లు ఉన్నాయి. ఆటోమోటివ్ విడిభాగాల ప్రపంచ కొరత కారణంగా డిమాండ్‌ను తీర్చడంలో కంపెనీ పెద్ద సవాలును ఎదుర్కొంటోంది.
మహీంద్రా కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవి డెలివరీలు ప్రారంభమైనప్పటికీ, చాలా మంది లాంగ్ వేటింగ్ గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఎస్‌యూవి డెలివరీ కోసం వెయిటింగ్ పీరియడ్ 75 వారాలు అంటే 525 రోజులకు చేరుకుంది అంటే దాదాపు 18 నెలలు.
టాప్-ఆఫ్-లైన్ XUV700 SUV డెలివరీ కోసం 1.5 సంవత్సరాలు వేచి ఉండాలి. అతి తక్కువ ధర ఎంఎక్స్ వేరియంట్ కోసం 25-27 వారాలు లేదా దాదాపు 6 నెలల డెలివరీ టైమ్ ఇచ్చింది. వేరియంట్ ప్రకారం మహీంద్రా XUV700 వెయిటింగ్ పీరియడ్ (వారాల్లో) వివరాలు..
వెరియంట్స్ పెట్రోల్ డీజిల్
MX 25-27 35-37
AX3 28-30 50-52
Ax5 51-53 50-52
AX7 65-67 65-57
AX7L 72-75 72-75
మహీంద్రా XUV700 పెట్రోల్ వేరియంట్‌లను అక్టోబర్ చివరి వారంలో డెలివరీ చేసింది, డీజిల్ వేరియంట్‌లను నవంబర్ చివరి వారంలో డెలివరీ చేసింది. అధిక బుకింగ్, సెమీ కండక్టర్ల కొరత కారణంగా డెలివరీలలో జాప్యానికి దారితీసింది. మొదటి రోజు బుకింగ్‌ల డెలివరీ తేదీలను 2022 మధ్యలో ఇచ్చారు, కొన్ని డెలివరీలు జూలై 2023 వరకు పొడిగించారు.