అయితే ఈ ప్రత్యేకమైన వాహనానం మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రకారం దత్తాత్రయ లోహర్ అనే వ్యక్తి తన కుమారుడి కోరికను నెరవేర్చడానికి లోక జ్ఞానం తక్కువ ఉన్నప్పటికీ ఈ వాహనాన్ని నిర్మించగలిగాడు. ఈ వినూత్న వాహన సృష్టి ఆనంద్ మహీంద్రాను ఎంతో ఆకట్టుకుంది. దీంతో అతను తన అఫిషియల్ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశాడు. అలాగే ఈ వీడియోను షేర్ చేస్తూ "ఇది స్పష్టంగా ఏ నిబంధనలకు అనుగుణంగా లేదు, కానీ మన ప్రజల తెలివి, సామర్థ్యాలను మెచ్చుకోవడం నేను ఎప్పటికీ కోల్పోను" అని అన్నారు
45 సెకన్ల గల ఈ వీడియోలో మహారాష్ట్రలోని దేవ్‌రాష్ట్రే గ్రామానికి చెందిన దత్తాత్రయ లోహర్ అనే కమ్మరి(black smith) వాహనం ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది. కేవలం రూ.60,000 పెట్టుబడితో ఈ వాహనం తయారు చేశాడు. అలాగే ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలకు మాత్రమే కనిపించే కిక్-స్టార్ట్ మెకానిజంను ఉపయోగిస్తుంది. ఇంకా పాత అలాగే వదిలివేసిన కారు భాగాలను ఉపయోగించి ఈ కారును నిర్మించారు దీనికి ఎడమ చేతి డ్రైవ్ ఉంటుంది.
మరో ట్వీట్‌లో వాహనం నిబంధనలకు అనుగుణంగా లేనందున స్థానిక అధికారులు దానిని రోడ్లపై తిరగకుండా నిలిపివేయవచ్చు అని ఆనంద్ మహీంద్రా తెలిపారు. అతని వినూత్న సృష్టికి బహుమతిగా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ వ్యక్తిగతంగా అతని బొలెరోను ఆఫర్ చేశారు. అలాగే అతని సృష్టి ఇతరులకు ప్రేరణగా మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో ప్రదర్శించబడుతుంది.
అతను "నిబంధనలను ఉల్లంఘించినందున స్థానిక అధికారులు అతనిని వాహనాన్ని త్వరలోనే లేదా భవిష్యత్తులో నడపకుండా ఆపివేయవచ్చు. అతని వాహనానికి బదులుగా నేను వ్యక్తిగతంగా బొలెరోను ఆఫర్ చేస్తున్నాను. అతని సృష్టిని మహీంద్రా రీసెర్చ్‌వ్యాలీలో ప్రదర్శించబడుతుంది, ఎందుకంటే 'రిసోర్స్ ఫుల్ నెస్' అంటే తక్కువ వనరులతో ఎక్కువ చేయడం."
లోహర్ వినూత్న సృష్టికి ప్రశంసలు కురిపించడంతో పాటు అతని వీడియో ట్విట్టర్ లో ఎంతో వైరల్ అయ్యింది. ఆనంద్ మహీంద్రాచేసిన ట్వీట్‌కు 14,000 పైగా లైక్‌లు, 1300 రీట్వీట్‌లు, టన్నుల కొద్దీ కామెంట్‌లు వచ్చాయి. స్మార్ట్ ఆవిష్కరణలు తరచుగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ దృష్టిని ఆకర్షిస్తుంటాయి.