ఇండియన్ ఫ్యామిలీ కుటుంబ అవసరాలను దృష్ట్యా కొత్త డిజైన్, అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లు, కంపెనీ సొంత టెక్నాలజీలతో ఈ మోడల్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, రేర్-ఎర్త్ మినరల్స్ లేకుండా ఎలక్ట్రిక్ మోటార్‌ను వాణిజ్యపరంగా తయారు చేసిన మొదటి ఇండియన్ కంపెనీలలో తమది ఒకటని సింపుల్ ఎనర్జీ చెబుతోంది. దీని ద్వారా దేశీయ టెక్నాలజీ అభివృద్ధిపై కంపెనీ ఎంత దృష్టి పెడుతుందో అర్థమవుతోంది.
ప్రస్తుతం కంపెనీ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన సింపుల్ ఆల్ట్రా.. ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీ, లాంగ్ రేంజ్, గంటకు 115 కిలోమీటర్ల గరిష్ట వేగం, ఫాస్ట్ యాక్సిలరేషన్, పెద్ద ఇన్ఫర్మేషన్ స్క్రీన్, డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో వస్తుంది. కానీ ఈ కొత్త ఫ్యామిలీ స్కూటర్ వేగం కంటే మన్నిక, సౌకర్యం, రోజువారీ వినియోగానికి బాగుంటుంది. కుటుంబాలు, విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవారు, పట్టణవాసుల అవసరాలను తీర్చే కొత్త ఆప్షన్‌గా ఈ మోడల్ నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.