Car Buying Guide : సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మరి లోన్ పెండింగ్ లో ఉందో లేదో తెలిసేదెలా? ఈజీ టిప్

Published : Jul 03, 2026, 02:00 PM IST

తక్కువ ధరకే వస్తోందని చాలామంది సెకండ్ హ్యాండ్ కారు హడావిడిగా కొంటుంటారు. కానీ కారుపై లోన్ ఉందో లేదో తెలుసుకోకపోతే తర్వాత చట్టపరమైన ఇబ్బందులు తప్పవు. మరి కారు లోన్ వివరాలను తెలుసుకోవడం ఎలాగో తెలుసా?

PREV
15
పాత కారు కొనబోతున్నారా..?

కొత్త కారు కొనడం బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం… బాగా డబ్బులున్నవారే లగ్జరీ కోసం కొత్తది కొంటుంటారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు మాత్రం లగ్జరీ కాదు సౌకర్యం కొరుకుంటారు… అందుకే చాలామంది తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కారు కొంటుంటారు. కొత్తకారు కోసం ఎక్కువ డబ్బులు పెట్టడంకంటే మంచి కండిషన్‌లో ఉన్న పాత కారు కొని డబ్బు ఆదా చేసుకోవడం మంచి నిర్ణయమే. 

అయితే సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు చాలామంది దాని తయారీ తేదీ, రిజిస్ట్రేషన్ వివరాలతో పాటు రంగు, తిరిగిన కిలోమీటర్లు, ఇంజిన్ కండిషన్ చెక్ చేస్తుంటారు. కానీ వీటన్నింటితో పాటు ఆ కారుపై బ్యాంక్ లోన్ ఇంకా ఉందేమో చూసుకోవడం చాలా ముఖ్యం… లేదంటే కొన్నాక ఇబ్బందిపడాల్సి ఉంటుంది. కారుపై బ్యాంక్ లోన్స్ ఉంటే చాలా ఈజీగా గుర్తించవచ్చు.. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం. 

25
హైపోథికేషన్ అంటే ఏంటి?

ఒక వ్యక్తి బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థ నుంచి లోన్ తీసుకుని కారు కొన్నప్పుడు ఆ వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)లో బ్యాంకు పేరును చేరుస్తారు. దీన్నే హైపోథికేషన్ అంటారు. లోన్ మొత్తం తిరిగి చెల్లించే వరకు ఆ కారుపై బ్యాంకు సర్వహక్కులను కలిగి ఉంటుంది. లోన్ తీరిపోయాక బ్యాంకు ఇచ్చే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) ఆధారంగా RC నుంచి బ్యాంకు పేరును తీసేయాలి. అప్పటివరకు ఆ బండి లోన్‌పై ఉన్నట్టే లెక్క.

35
సెకండ్ హ్యాండ్ కారు లోన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

మీరు కొనాలనుకుంటున్న కారుపై లోన్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి

RC కార్డు చెక్ చేయండి

కారు ఒరిజనల్ RC కార్డుపై 'Hypothecated to' అని రాసి ఏదైనా బ్యాంకు పేరు ఉందేమో చూడండి. ఉంటే ఆ బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థలో ఈ కారుపై లోన్ ఉందన్నమాట.

వాహన్ పోర్టల్

ప్రభుత్వ 'పరివాహన్ సేవ' లేదా 'వాహన్' వెబ్‌సైట్‌కి వెళ్లి బండి నంబర్ ఎంటర్ చేసి RC స్టేటస్ చెక్ చేయండి. అక్కడ హైపోథికేషన్ యాక్టివ్‌గా ఉందో లేదో సమాచారం ఉంటుంది. 

mParivahan యాప్

మీ మొబైల్‌లో mParivahan యాప్ డౌన్‌లోడ్ చేసుకుని కూడా వాహన వివరాలు పొందవచ్చు.

45
ఒరిజినల్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటేనే కొనండి

లోన్ మొత్తం కట్టేశానని అమ్మేవాళ్లు చెబితే, ఆ మాటలు గుడ్డిగా నమ్మొద్దు. బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థ జారీ చేసిన ఒరిజినల్ 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC), 'ఫారం 35' అడగండి. ఈ డాక్యుమెంట్లు లేకుండా రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (RTO)లో వాహనం ఓనర్‌షిప్ మార్చడం అస్సలు కుదరదు. కాబట్టి NOC, ఫారం 35 తర్వాత ఇస్తామంటే ఒప్పుకోకండి… ఇవి మీ చేతికి అందాకే మొత్తం డబ్బులు ఇవ్వండి. 

55
సెకండ్ హ్యాండ్ కారు కొనేముందు ముఖ్యమైన చెక్స్

ఇన్సూరెన్స్ రికార్డ్

కారు ఇన్సూరెన్స్ కరెంట్‌గా ఉందో లేదో చెక్ చేయండి. గతంలో కారుకు ఏవైనా పెద్ద యాక్సిడెంట్లు అయ్యాయా లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేశారా అని కూడా చూడండి.

PUC సర్టిఫికేట్

పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికేట్ వ్యాలిడిటీలో ఉండాలి, లేదంటే ఫైన్ కట్టాల్సి వస్తుంది. 

సర్వీస్ హిస్టరీ

కారును అధీకృత షోరూమ్‌లలో రెగ్యులర్‌గా సర్వీస్ చేయించారో లేదో చెక్ చేయడం మంచిది. 

ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్

అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటేనే డబ్బులు చెల్లించి, డీల్ పూర్తి చేయండి. రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (RTO)లోనే హైపోథికేషన్ రద్దు చేయించుకోండి. ఓనర్‌షిప్ మీ పేరు మీదకు మారిన తర్వాతే మీరు పూర్తిగా సేఫ్‌గా ఉన్నట్టు. గుర్తుంచుకోండి, డాక్యుమెంట్ల విషయంలో చిన్న అజాగ్రత్త కూడా మిమ్మల్ని చట్టపరమైన చిక్కుల్లో పడేస్తుంది. కాబట్టి సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు తెలివిగా వ్యవహరించండి.

Read more Photos on
click me!

Recommended Stories