క్లాసిక్ 350 కంపెనీలో అత్యధికంగా అమ్ముడైన మోడల్ లో ఒకటి. ఇప్పుడు కంపెనీ ఈ బైక్ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌ను విడుదల చేయనుంది. ఈ బైక్ లాంచ్ కి సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక సమాచారాన్ని ప్రకటించనప్పటికీ, కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 డిజైన్ ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే చాలా రిఫ్రెష్‌గా, కొత్తగా ఉంటుంది. లీకైన ఫోటోల ప్రకారం, మెటీరియర్ 350 స్టైలింగ్ అంశాలు ఇందులో చూడవచ్చు.
కొత్త 348సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఈ బైక్‌లో ఉపయోగించారు. ఈ ఇంజన్ 19.2హెచ్‌పి పవర్, 27ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే కొత్త 5-స్పీడ్ గేర్‌బాక్స్ అందించారు. కొత్త బైక్ ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువ శక్తిని పొందుతుంది. కొత్త 2021 క్లాసిక్ 350లో కనిపించే ఇండికేటర్ లైట్ డిజైన్ కూడా మార్చినట్లు ఫోటోలలో చూపుతున్నాయి. నివేదిక ప్రకారం, కొత్త బైక్ లో ఎల్‌ఈడి హెడ్ లైట్లను ఇవ్వవచ్చు. హాలోజన్ లైట్లు ప్రస్తుత మోడల్‌లో ఉన్నాయి. కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కంపెనీ కొత్త జే ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. నివేదిక ప్రకారం ఈ బైక్ సింగిల్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్‌కు బదులుగా ట్విన్ డౌన్‌ట్యూబ్ ఫ్రేమ్‌పై నిర్మించారు. దీనితో బైక్ సైడ్ ప్రొఫైల్ పాత మోడల్ కంటే మెరుగ్గా మారింది. ఈ ఫ్రేమ్ గత సంవత్సరం నవంబర్‌లో లాంచ్ అయిన కంపెనీ మెటిరియర్ 350లో కూడా ఉపయోగించారు. ఈ కారణంగా బైక్ నిర్వహణ, పనితీరు పాత మోడల్ కంటే మెరుగ్గా ఉంటుంది.
కొత్త జనరేషన్ మోడల్‌కు బ్యాలెన్సర్ షాఫ్ట్ జోడించారు, ఈ కారణంగా బైక్ లో తక్కువ వైబ్రేషన్ ఉంటుంది. ఇంకా ప్రస్తుత మోడల్ కంటే రైడర్‌కు మెరుగైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అయితే, కొత్త బైక్ పూర్తిగా ట్రెడిషనల్ డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది. కానీ ఇందులో కొన్ని మార్పులు ఉంటాయి. క్రోమ్ బెజెల్స్‌తో రెట్రో-స్టైల్ గుండ్రటి హెడ్‌ల్యాంప్‌లు, టియర్ డ్రాప్ షేప్‌లో ఫ్యూయల్ ట్యాంక్, రౌండ్ షేప్ రియర్ వ్యూ మిర్రర్స్, క్రోమ్-ప్లేటెడ్ ఎగ్సాస్ట్ (సైలెన్సర్), ఆకర్షణీయమైన ఫెండర్‌లను పొందుతుంది. సైడ్ ప్యానెల్లు ఇంకా ఇంధన ట్యాంక్ సి-ఆకారపు గ్రాఫిక్స్ కలిగి ఉంటాయి, అయితే ఫెండర్లలో కొత్త స్ట్రిప్‌లు ఇచ్చారు.
నివేదిక ప్రకారం ఫ్యూయల్ గేజ్, ఓడోమీటర్, టిప్పర్ నావిగేషన్ పాడ్ గురించి సమాచారం కోసం 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 డిజిటల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆర్‌ఈ మీటిరియర్ 350 బైకులో కంపెనీ ఇప్పటికే ఈ ఫీచర్లను ఇచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ టిప్పర్ నావిగేషన్ సిస్టమ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసినప్పుడు టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను చూపుతుంది. 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మీటిరియర్ 350 లాగానే సెమీ డిజిటల్ స్పీడోమీటర్‌తో డిస్‌ప్లేను పొందుతుంది. ఈ ఫీచర్ సహాయంతో రైడర్స్ నావిగేట్ చేయవచ్చు. ఈ డిస్‌ప్లే టర్న్ బై టర్న్ డైరెక్షన్ గురించి సమాచారాన్ని అందిస్తుంది. టిప్పర్ నావిగేషన్ గూగుల్ కి కనెక్ట్ చేయబడుతుంది. ఇలాంటి పరిస్థితిలో రైడర్ మార్గం కోల్పోకుండా ఏదైనా తెలియని ప్రదేశానికి సులభంగా చేరుకోవచ్చు. ఈ ఫీచర్‌లోని అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, రైడర్ స్మార్ట్‌ఫోన్‌లో నెట్‌వర్క్ సిగ్నల్ సమస్య ఉన్నప్పుడు కూడా చాలా బాగా పని చేస్తూ ఉంటుంది. ఈ ఫీచర్ అడ్వెంచర్ రైడింగ్ లవర్స్ కి బాగా ఉపయోగపడుతుంది.
కంపెనీ మెటిరియర్ 350లో నాబ్ స్టైల్ ఇగ్నిషన్ స్విచ్ ఇచ్చింది. 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో కూడా ఇదే విధమైన నాబ్ స్టైల్ ఇగ్నిషన్ స్విచ్ అందించారు. దాని లుక్ చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ట్రెడిషనల్ ఇగ్నిషన్ స్విచ్ నుండి చాలా భిన్నంగా ఉంటుంది. బొటనవేలు సహాయంతో ఇగ్నిషన్ స్విచ్ నాబ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. ఈ కారణంగా బైక్ క్షణంలో స్టార్ట్ అవుతుంది.
కొత్త 2021 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ భద్రతా ఫీచర్స్ కంటే చాలా ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి. కొత్త క్లాసిక్ 350 పుష్రోడ్-వాల్వ్ సిస్టమ్‌కు బదులుగా SOHC సెటప్‌ను పొందుతుంది. కొత్త డ్యూయల్ క్రెడిల్ వీల్ కాకుండా, న్యూ-జెన్ క్లాసిక్ 350 ట్విన్ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌లతో 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో 270 ఎంఎం రియర్ డిస్క్ బ్రేక్‌ని పొందుతుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త క్లాసిక్ 350 లో డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ సిస్టమ్‌ను అందిస్తోంది. దీని ద్వారా బైక్ భద్రతను మరింత మెరుగుపరుస్తుంది. అలాగే వీల్స్ ఇంతకుముందు కంటే మెరుగ్గా ఉంటాయి.