ఈ ఫ్లాగ్‌షిప్ ఇ-స్కూటర్‌ను విడుదల చేయడానికి ముందు దీనికి 30 లీటర్ల బూట్ సామర్థ్యంతో వస్తుందని కంపెనీ వెల్లడించింది. ప్రీమియం ఇ-స్కూటర్ విభాగంలో ఇది అతిపెద్దదిగా కంపెనీ పేర్కొంది. మొదటి దశలో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, గోవా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్‌తో సహా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలలో విడుదల చేయనుంది. సింపుల్ ఎనర్జీ ఈ రాష్ట్రాల్లోని నగరాల్లో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ల కోసం షార్ట్‌లిస్ట్ చేసిన లొకేషన్‌లను కలిగి ఉందని, తద్వారా దీనిని త్వరలో విస్తరించవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉనికిని విస్తరించేందుకు వచ్చే రెండేళ్లలో రూ .350 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోంది.