Royal Enfield Classic 350: రాయల్ ఎన్ ఫీల్డ్…రైడర్లకు అదిరే ట్రీట్ ఇచ్చింది. తన ఐకానిక్ క్లాసికల్ 350 బైక్‍కు 2026 మోడల్‍ను లాంచ్ చేసింది. రైడర్ల కోసం అస్టిస్, స్లిప్పర్ క్లచ్, USB టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఫీచర్ యాడ్ చేసింది. దీని ధర ఎంతంటే?
రాయల్ ఎన్ ఫీల్డ్ తన ఐకానిక్ క్లాసికల్ 350 బైక్‍కు 2026 మోడల్‍ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. రైడర్ల సౌకర్యం కోసం అస్టిస్, స్లిప్పర్ క్లచ్, USB టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఫీచర్లను యాడ్ చేసింది. ఇది రైడర్ల కోసం రాయల్ ఎన్ ఫీల్డ్ ఇస్తున్న ట్రీట్ అని చెప్పుకోవాలి. బైక్ లుక్, ఇంజిన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. కానీ, రోజూ వాడేవాళ్లకు, ముఖ్యంగా సిటీల్లో, లాంగ్ రైడ్స్ చేసేవాళ్లకు ఉపయోగపడే 2 ముఖ్యమైన అప్‌డేట్స్ ఇచ్చింది. అవేంటంటే.. కొత్త అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్, ఫాస్ట్ యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్. అయితే, ఈ రెండు ఫీచర్లు ప్రస్తుతానికి డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
25
కొత్త స్లిప్పర్ క్లచ్
కొత్తగా ఇచ్చిన స్లిప్పర్ క్లచ్ రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. దీనివల్ల క్లచ్ లీవర్‌ను తక్కువ ప్రెషర్‌తోనే ఆపరేట్ చేయొచ్చు. సిటీ ట్రాఫిక్‌లో బండిని ఆపాల్సి వచ్చినప్పుడు, మళ్లీ స్టార్ట్ చేయాల్సి వచ్చినప్పుడు చేతులకు అలసట తగ్గుతుంది. అంతేకాదు, వేగంగా వెళ్తున్నప్పుడు సడన్‌గా గేర్లు తగ్గిస్తే (డౌన్‌షిఫ్ట్) వెనుక చక్రం కంట్రోల్ తప్పకుండా చూసుకుంటుంది. దీంతో బండి స్టెబిలిటీ పెరిగి, రైడర్‌కు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది.
35
యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్
మరో ముఖ్యమైన అప్‌డేట్.. కొత్త యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్. ఇంతకుముందు క్లాసిక్ 350లో యూఎస్‌బీ ఛార్జింగ్ ఉన్నా, ఇప్పుడు దాన్ని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే టైప్-సి పోర్ట్‌తో అప్‌గ్రేడ్ చేశారు. ప్రయాణంలో స్మార్ట్‌ఫోన్లు, జీపీఎస్ నావిగేషన్ డివైజ్‌లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఛార్జ్ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా లాంగ్ రైడ్స్ చేసేవారికి ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. లేటెస్ట్ మొబైల్స్‌కు అనుకూలంగా టైప్-సి కనెక్టివిటీ ఇవ్వడం ఒక ప్లస్ పాయింట్.
ధరల విషయానికొస్తే, సింగిల్-ఛానల్ ఏబీఎస్ ఉన్న రెడిట్చ్ రెడ్ (Redditch Red) వేరియంట్ ధర రూ.1.87 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో కొత్త స్లిప్పర్ క్లచ్, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉండవు. ఈ రెండు ఫీచర్లు డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ వేరియంట్లలో మాత్రమే వస్తాయి. వీటి ప్రారంభ ధర రూ.1.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇక టాప్ వేరియంట్ అయిన ఎమరాల్డ్ గ్రీన్ (Emerald Green) కలర్ బైక్ ధర రూ.2.24 లక్షలు (ఎక్స్-షోరూమ్). 2026 మోడల్ లైనప్ నుంచి హల్సియాన్ బ్లాక్ (Halcyon Black), జోధ్‌పూర్ బ్లూ (Jodhpur Blue) కలర్ ఆప్షన్లను కంపెనీ తొలగించింది.
55
క్లాసిక్ 350 ఫీచర్లు
2026 క్లాసిక్ 350 ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. పాత మోడల్‌లో ఉన్న 349cc J-సిరీస్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌నే కొనసాగించారు. ఈ ఇంజిన్ 20.2 hp పవర్, 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మెకానికల్ ఫీచర్లలో కూడా మార్పుల్లేవు. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్లు, 19-అంగుళాల ముందు చక్రం, 18-అంగుళాల వెనుక చక్రం ఉన్న స్పోక్ వీల్స్ సిస్టమ్‌నే కొనసాగించారు. కాబట్టి, 2026 అప్‌డేట్‌లో క్లాసిక్ 350 సంప్రదాయ లుక్, పర్ఫార్మెన్స్ అలాగే ఉంటాయి. కేవలం రోజువారీ రైడింగ్‌ను సులభతరం చేసే కొత్త ఫీచర్లను మాత్రమే జోడించారు.