Maruti EV: మారుతి సుజుకి కొత్త 'విజన్ ఇ-స్కై' ఎలక్ట్రిక్ కారు తీసుకురానుంది. టాటా టియాగో EVకి పోటీగా రానున్న ఈ బడ్జెట్ EV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 270 కి.మీ. మైలేజ్ ఇస్తుందని అంచనా. ముందు గ్లోబల్ మార్కెట్లో విడుదల చేశాక బారత్‍లో లాంచ్ చేయనున్నారు.
మారుతి సుజుకి కొత్త 'విజన్ ఇ-స్కై' ఎలక్ట్రిక్ కారు తీసుకురానుంది. టాటా టియాగో EVకి పోటీగా రానున్న ఈ బడ్జెట్ EV ఒక్కసారి ఛార్జ్ చేస్తే 270 కి.మీ. మైలేజ్ ఇస్తుందని అంచనా. ముందు గ్లోబల్ మార్కెట్లో విడుదల చేశాక బారత్‍లో లాంచ్ చేయనున్నారు. భారత మార్కెట్లో మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కారు 'ఇ-విటారా' (e-Vitara) మిడ్‌సైజ్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది. కానీ, దీని అమ్మకాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ ఎస్‌యూవీ ధర మధ్యతరగతి కస్టమర్ల బడ్జెట్‌కు కొంచెం ఎక్కువ. అందుకే సుజుకి కంపెనీ ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలో, ఎంట్రీ లెవల్ చిన్న ఎలక్ట్రిక్ కారును తీసుకురావడానికి రెడీ అవుతోంది.
26
టియాగో EVకి పోటీగా 'విజన్ ఇ-స్కై'
సుజుకి తీసుకురాబోతున్న ఈ కొత్త చిన్న ఎలక్ట్రిక్ కారే 'విజన్ ఇ-స్కై' (Vision e-Sky). మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్న టాటా టియాగో EV (Tiago EV), ఎంజీ కామెట్ EV (MG Comet EV)లకు ఇది నేరుగా పోటీ ఇవ్వనుంది. సైజులో ఇది టియాగో EV కంటే చిన్నగా, ఎంజీ కామెట్ కంటే పెద్దగా ఉంటుంది. 2025 జపాన్ మొబిలిటీ షోలో సుజుకి ఈ కారు కాన్సెప్ట్ మోడల్‌ను ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించింది.
36
మారుతి ఎస్-ప్రెస్సో కన్నా చిన్న సైజు
ఈ కారు సైజు, డిజైన్ పరంగా సిటీ ప్రయాణాలకు చాలా అనువుగా ఉంటుంది. దీని పొడవు కేవలం 3395 ఎంఎం, వెడల్పు 1475 ఎంఎం, ఎత్తు 1625 ఎంఎం మాత్రమే. అంటే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి చిన్న కారు 'ఎస్-ప్రెస్సో' (S-Presso) కన్నా ఇది పరిమాణంలో చిన్నది. దీంతో హెవీ ట్రాఫిక్ రోడ్లపై సులభంగా నడపొచ్చు, పార్కింగ్ చేయడం కూడా చాలా ఈజీ.
ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు సైజులో చిన్నదే అయినా మైలేజ్ విషయంలో మాత్రం ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ కారు ఏకంగా 270 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్ ఇస్తుందని రిపోర్టులు చెబుతున్నాయి. కంపెనీ మొదట ఈ కారును యూరప్ మార్కెట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. అక్కడ ఇది హోండా సూపర్-ఎన్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.
56
గ్లోబల్ మార్కెట్లో లాంచ్ ఎప్పుడంటే?
సుజుకి కంపెనీ ఈ కారును గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, సుజుకి బ్రాండ్ ఈ కారును ఇదే ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది.
66
భారత్‌కు కూడా ఈ చవకైన EV వస్తుందా?
ప్రస్తుతానికి సుజుకి ఈ కారును గ్లోబల్ మార్కెట్ కోసమే డిజైన్ చేస్తోంది. కానీ, భారతదేశంలో బడ్జెట్ ధరలో ఉండే EV కార్లకు ఉన్న భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మారుతి సుజుకి ఈ కారు ఇండియన్ వెర్షన్‌ను ఇక్కడ విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, దీనిపై మారుతి సుజుకి నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కస్టమర్లు ప్రస్తుతానికి వేచి చూడక తప్పదు.