రెనాల్ట్ చౌకైన 7 సీట్ల ఎమ్‌పివి మరో ఘనత.. కేవలం 2 సంవత్సరాలలో 75వేలకు పైగా అమ్మకాలు..

First Published | Apr 14, 2021, 11:43 AM IST

ఫ్రాన్స్‌కు  చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ రెనాల్ట్ ఇండియాలో మరో మైలురాయిని సాధించింది. సంస్థ నుండి వస్తున్న చౌకైన 7-సీట్ల ఎమ్‌పివి  రెనాల్ట్ ట్రైబర్  75వేల యూనిట్ల అమ్మకాలను దాటింది. 

రెనాల్ట్ ట్రైబర్ ఇండియాలోని చౌకైన ఎం‌పి‌వి (మల్టీ పర్పస్ వెహికల్) కాగా దీని అద్భుతమైన లుక్, విశాలమైన డిజైన్ కారణంగా ఈ కారు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వారిని ఎంతో ఆకర్షితోంది.
మార్కెట్ వాటా పెరిగిందిరెనాల్ట్ కంపెనీ ట్రైబర్ 7-సీటర్ కారును 28 ఆగస్టు 2019న భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఆ సమయంలో ఈ కారు యుటిలిటీ వెహికల్ విభాగంలో 1.57 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. తరువాత 20-21 ఆర్థిక సంవత్సరంలో ట్రైబర్ మార్కెట్ వాటా 4.79 శాతానికి పెరిగింది. అంటే దీని బట్టి రెనాల్ట్ ట్రైబర్ ప్రజాదరణను అంచనా వేయవచ్చు.

దీని ధర కారణంగా మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. 2020 ఆర్థిక సంవత్సరంలో రెనాల్ట్ ట్రైబర్ 33,860 యూనిట్లను విక్రయించగా (ఆగస్టు 2019 నుండి మార్చి 2020 మధ్య), 2021 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2020 నుండి మార్చి 2021 మధ్య) కంపెనీ మొత్తం 40,956 యూనిట్ల ట్రైబర్‌ను విక్రయించింది. గత నెలలో కంపెనీ కొత్త అప్‌డేటెడ్ ఫీచర్లతో ట్రైబర్‌ను పరిచయం చేసింది. అలాగే ఇప్పుడు డ్యూయల్ టోన్ కలర్స్ ఎంపికతో లభిస్తుంది.
ఇంజన్ పవర్రెనాల్ట్ ట్రైబర్ ఎంపివి సింగిల్ పెట్రోల్ ఇంజన్ తో నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారుకు 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అందించారు. ఈ ఇంజన్ 72 హెచ్‌పి శక్తిని, 96 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ కి 5-స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. ట్రైబర్ ఎమ్‌పివి లీటరుకు 20 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
ఆకర్షణీయమైన ఫీచర్లురెనాల్ట్ ట్రైబర్ లో చాలా ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎల్‌ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఆపిల్ కార్ ప్లే, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఆండ్రాయిడ్ ఆటో ఉన్నాయి. దీనితో పాటు రివర్స్ పార్కింగ్ సెన్సార్, పవర్ విండో, రియర్ వాష్ వైపర్స్, మూడు వరుసలలో ఎసి వెంట్స్, కూల్డ్ సెంటర్ బాక్స్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టోర్ స్టాప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి కాకుండా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి) వంటి భద్రతా ఫీచర్లను కూడా అందించారు.
ధరరెనాల్ట్ కంపెనీ ట్రైబర్‌ను భారత మార్కెట్లో రూ .4.95 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభించింది. కానీ ఇప్పుడు ఈ ఎంపివి ధరను రూ .5.30 లక్షల నుంచి రూ .7.82 లక్షలకు పెంచారు.

Latest Videos

click me!