అల్ న్యూ రెనాల్ట్ డస్టర్ కొత్త జనరేషన్ 2022 మోడల్‌.. మిమ్మలి ఆకట్టుకునే అధ్భూతమైన ఫీచర్లు ఇవే..

First Published Jun 24, 2021, 1:45 PM IST

డాసియా యాజమాన్యంలోని ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ కంపెనీ రెనాల్ట్  ప్రజలు చివరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త జనరేషన్ డస్టర్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. ఈ ఎస్‌యూవీని రెనాల్ట్ బ్రాండ్ కింద భారత మార్కెట్లో విక్రయించనున్నారు. 

తాజాగా ఈ కొత్త ఎస్‌యూవీ కొన్ని ఫోటోలు బయటపడ్డాయి. ఆల్-న్యూ 2022 డస్టర్ ఎస్‌యూవీలో లుక్, డిజైన్ తో పాటు ఇంటీరియర్ లో చాలా పెద్ద మార్పులను చేశారు. మిడ్-లైఫ్ ఫేస్ లిఫ్ట్ కొత్త 2022 డస్టర్ డిజైన్, కొత్త టెక్నాలజీ పరంగా చాలా అప్ డేట్స్ పొందింది.
undefined
కొత్త లుక్కొత్త డస్టర్ ప్రస్తుత మోడల్ నుండి వేరుచేసే కొత్త గ్రిల్‌తో వై- ఆకారపు హెడ్‌లైట్ డిజైన్‌, దీనితో పాటు కొత్త డస్టర్‌లో మరో పెద్ద మార్పు ఏంటంటే ఎల్‌ఈడీ ఫ్రంట్ ఇండికేటర్లు వీటిని ఈ ఎస్‌యూవీలో మొదటిసారి ఇచ్చారు. కొత్త ఏరో-ఆప్టిమైజ్డ్ 15-అంగుళాలు అండ్ 16-అంగుళాల వీల్ ఆప్షన్స్, స్పాయిలర్ డిజైన్‌, కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు ఇచ్చారు.
undefined
కొత్త ఇంటీరియర్ అండ్ ఫీచర్లుకొత్తగా అప్ డేట్ చేసిన క్యాబిన్ రిడిజైన్ చేయబడిన సెంటర్ కన్సోల్‌ను ఎక్కువ స్టోరేజ్ తో పరిచయం చేశారు. 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్‌తో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్, గ్రాఫిక్‌లతో వస్తుంది. దీన్ని స్మార్ట్‌ఫోన్‌లతో అనుసంధానించవచ్చు. కారు కొన్ని ఇతర ముఖ్యమైన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఇందులో క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ హెడ్ లైట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హిటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. అయితే కొత్త హిటెడ్ సీట్లు ఎస్‌యూవీ టాప్ వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి. మీడియా డిస్‌ప్లే సిస్టమ్ రేడియో, బ్లూటూత్, రెండు యుఎస్‌బి పోర్ట్‌లు, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, వాయిస్ రికగ్నిషన్ వంటి ఫీచర్స్ లభిస్తాయి. భద్రత పరంగా ఇందులో చాలా అప్ డేట్స్ చేర్చరు. మల్టీవ్యూ కెమెరా, పార్కింగ్ సెన్సార్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్ పొందుతుంది.
undefined
ఇంజిన్ అండ్ పవర్కొత్త డస్టర్ వేర్వేరు మార్కెట్ల ఆధారంగా మల్టీ ఇంజన్ ఎంపికలతో విక్రయిస్తున్నారు. ఈ ఎస్‌యూవీని 3 పెట్రోల్ ఇంజన్, 1 డీజిల్ ఇంజన్, 1 బయో ఫ్యూయల్ ఇంజన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఐరోపాలో కొత్త డస్టర్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ 89 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రెండవది 1.3-లీటర్ పెట్రోల్ ఇంజన్ 128 బిహెచ్‌పి, 148 బిహెచ్‌పిల శక్తిని ఇస్తుంది. దీనితో పాటు ఈ ఎస్‌యూవీకి 1.0-లీటర్ బయో ఫ్యూయల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా లభిస్తుంది.
undefined
లాంచింగ్ వివరాలుకంపెనీ ఇప్పటికీ డస్టర్ మొదటి జనరేషన్ మోడల్‌ను మాత్రమే భారత మార్కెట్లో విక్రయిస్తుంది. సిఎన్‌ఎఫ్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ పై రెనాల్ట్ కిగర్, క్విడ్, ట్రైబర్ మోడళ్ల అమ్మకాలపై సంస్థ ప్రస్తుతం ఎక్కువ దృష్టి సారించినందున కొత్త మోడల్ ఇప్పట్లో ఇండియాలోకి వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తుంది.
undefined
ధరఐరోపాలో రెనాల్ట్ డస్టర్ చౌకైన ఎస్‌యూవీ, దీని ధర రూ.12,500 యూరోలు (సుమారు రూ. 12.87 లక్షలు) నుండి ప్రారంభమవుతాయి. ఒక నివేదిక ప్రకారం ఫేస్ లిఫ్ట్ మోడల్ ధరలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు.
undefined
click me!