అయితే దీనికి పారలెల్ ట్విన్ ఇంజన్ అందించిన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, కొన్ని కాలం నుండి దీనికి సంబంధించి తాజా అప్ డేట్ లేదు. ఇప్పటి వరకు రాయల్ ఎన్ఫీల్డ్ 650 సిసి మోడల్ హిమాలయన్ అడ్వెంచర్ బైక్ ని భారత మార్కెట్లలో లాంచ్ తేదీ గురించి ప్రకటించలేదు. దీనిబట్టి హిమాలయన్ 650కి మరికొంత సమయం పడుతుందని అనిపిస్తుంది.
ఈ బైక్ బరువు 199 కిలోలు ఉంటుందని అందువల్లనే రాయల్ ఎన్‌ఫీల్డ్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ విభాగంలో మన్నికైన 648 సిసి పారలెల్ ట్విన్ ఇంజన్ బైక్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు. కొత్త హిమాలయన్ 650కి రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్రిప్పర్ అండ్ సీటు, బ్యాక్ క్యారియర్, ఫ్రంట్ ర్యాక్ ఇంకా కొత్త విండ్‌స్క్రీన్ అప్‌గ్రేడ్‌లు లభించవచ్చు. 648 సిసి ట్విన్ సిలిండర్ ఇంజన్ 47 బిహెచ్‌పి వద్ద 7250 ఆర్‌పిఎమ్ అందిస్తుంది. అలాగే 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రవొచ్చు.
2016లో ప్రారంభమైన హిమాలయన్ అడ్వెంచర్ టూరింగ్ కింద ప్రత్యేకమైన సబ్ క్యాటగిరిలో వస్తుంది. ఐరోపా, అమెరికా, లాటిన్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఆసియాలోని అనేక దేశాలలో దీనిని విక్రయిస్తున్నారు.మొదట దీనిని భారతదేశంలో న్యూ గ్రానైట్ బ్లాక్, మిరాజ్ సిల్వర్, పైన్ గ్రీన్ కలర్లలో బుకింగ్ అండ్ టెస్ట్ రైడ్ లకు అందుబాటులో ఉంచవచ్చు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ సిఇఒ వినోద్ కె దాసరి మాట్లాడుతూ, “5 సంవత్సరాల వ్యవధిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ గ్లోబల్ అడ్వెంచర్ టూరింగ్‌లో కొత్త క్యాటగిరి కావొచ్చు. ఇది నిజమైన గ్లోబల్ బైక్ గా విజయవంతంగా స్థిరపడింది. అనేక దేశాలలో ఎక్కువగా ఇష్టపడే బైక్స్ లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకటి. " అని గతంలో అన్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 650 అభివృద్ధి భారతదేశంలోనే కాదు, బ్రాండ్ యు.కె టెక్నాలజీ సెంటర్‌లో చెందుతోంది, బైక్ అభివృద్ధి ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో విడుదలైనట్లు తెలుస్తుంది.ప్రస్తుతం దీనిని హిమాలయన్ 650 అని పిలవబడినప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ అధికారికంగా దీనికి ఏం పేరు పెడుతుందో చూడాలి.