ఈ బైక్ 80 kmph వేగంతో ప్రయాణించగలదు. 3.24 KWh కెపాసిటీతో Li-ion బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కి.మీ వెళ్తుంది. ఇంకా బ్యాటరీ 4.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
Hero Vida V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 80 kmph, కాబట్టి ఇతర ICE లేదా టాప్ స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు లభించే అన్ని ఫీచర్స్ ఈ స్కూటర్‌లో చూడవచ్చు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 110 కి.మీ ఇంకా మీకు 5 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. విడా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర: రూ.1,45,900.
ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 121 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. ఈ స్కూటర్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో అందించబడింది. ఈ ఇ-స్కూటర్ సిటీ రైడింగ్‌కు కూడా చాలా అనువుగా ఉంటుంది. ఇందులో 3 డ్రైవ్ మోడ్‌లు, 22 లీటర్ స్టోరేజ్ స్పేస్, లాంగ్ లెగ్‌రూమ్, పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్, USB ఛార్జింగ్ పాయింట్, రివర్స్ మోడ్, సైడ్ స్టాండ్ సెన్సార్ మొదలైనవి ఉన్నాయి. ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర: రూ.94,900.
Dark Motors Kratos R ఎలక్ట్రిక్ బైక్ 4kWH లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది, దీనిని ఒక్కసారి ఛార్జింగ్‌తో 180 కి.మీ వరకు వెళ్లగలదు. ఈ స్కూటర్ 105 kmph వేగంతో నడుస్తుంది. 1 గంటలో 80 శాతం బ్యాటరీని ఛార్జ్ చేయగలదు. డార్క్ మోటార్స్ ఎలక్ట్రిక్ బైక్ ధర: రూ.1,87,499.
Okaya ఫాస్ట్ F4 ఎలక్ట్రిక్ స్కూటర్ 6 కలర్స్ అప్షన్స్ లో అందించబడుతుంది. దీనిలో 72V60Ah కెపాసిటీ గల బ్యాటరీ ఉంది, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ నుండి 150 కి.మీల పరిధిని అందిస్తుంది. ఈ ఇ-స్కూటర్ బ్యాటరీని 4-5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఒకాయ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర: రూ.1,32,990.