2023 సెప్టెంబర్ నెలలో రాహుల్‌తో పాటు ఓ యువకుడు ఈ హోటల్‌కి వెళ్లి బిర్యానీ తిన్నారు. కార్ విన్నింగ్ క్యాంపెయిన్ ప్రారంభమైన తర్వాత ఈ హోటల్‌లో బిర్యానీ కొనే ప్రతి వినియోగదారుడి పేరు, చిరునామా, ఫోన్ నంబర్ కూపన్‌పై రాసి పెట్టెలో వేస్తారు.
రాహుల్ బిర్యానీ తిని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత రోబో హోటల్‌లో బిర్యానీ తిన్న సంగతి కూడా మరిచిపోయాడు. సెప్టెంబర్ గడిచి 2023 సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం కూడా మొదలైంది.