Porsche 718 Cayman GT4 RS:పోర్స్చే సూపర్ పవర్ ఫుల్ కార్.. టాప్ స్పీడ్ గంటకు ఎంతంటే?

First Published | May 19, 2022, 6:33 PM IST

జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమేకర్ పోర్స్చే (Porsche) 718 కేమాన్ GT4 RS (718 Cayman GT4 RS)ను ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.54 కోట్లు. GT4 RS లాంచ్‌తో అత్యంత శక్తివంతమైన 718 ఇప్పుడు ఇండియాలోకి అందుబాటులోకి వచ్చింది. 

భారతదేశంలో సాధారణ 718 కేమాన్ (718 కేమాన్) ప్రారంభ ధర రూ. 1.36 కోట్లతో ప్రారంభమవుతుంది. 718 కేమాన్ GT4 RS గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కారు RS బ్యాడ్జింగ్‌ను పొందిన మొదటి కేమ్యాన్. 
 

ఇంజిన్ పవర్ అండ్ స్పీడ్ 
718 కేమాన్ GT4 RS 4.0-లీటర్ ఫ్లాట్-6 ఇంజిన్‌ను పొందుతుంది. ఈ ఇంజిన్‌ చాలా శక్తిని ఉత్పత్తి చేస్తుంది. RS బ్యాడ్జింగ్ అంటే మీరు 493bhp గరిష్ట పవర్ అవుట్‌పుట్, 450Nm గరిష్ట టార్క్‌ని పొందుతుంది.  అంటే  సాధారణ కేమాన్ GT4 మోడల్‌ కంటే దాదాపు 80 bhp పవర్, 20 Nm టార్క్‌ను పెంచుతుంది. ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు. కానీ  7-స్పీడ్ PDK ట్రాన్స్‌మిషన్‌ ఉంది. దీని కారణంగా ఈ కారు కేవలం 3.4 సెకన్లలో 0 నుండి 100 kmph స్పీడ్ అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 315 కిలోమీటర్లు. 


పోర్స్చే కారు మొత్తం పనితీరును మెరుగుపరచడానికి కొన్ని చర్యలు తీసుకుంది ఇంకా ఇవన్నీ దాని డిజైన్‌లో కూడా కనిపిస్తుంది. బానెట్ ఇప్పుడు బ్రేక్‌లను చల్లబరుస్తుంది. సైడ్ ప్రొఫైల్‌కు వస్తే కొత్త ఎయిర్ ఇన్‌టేక్‌లు కారుకు రెండు వైపులా వెనుక భాగంలో కనిపిస్తాయి.  అలాగే, వెనుకవైపు ఉన్న స్వాన్ నెక్ ఫిక్స్‌డ్ స్పాయిలర్  కొత్త డిజైన్‌తో పాటు, GT4 RS మోడల్ 25 శాతం ఎక్కువ డౌన్‌ఫోర్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని కారణంగా  ఈ కారు ఇతర 718 మోడళ్ల కంటే  రేస్ ట్రాక్ కి చాలా మెరుగ్గా ఉంటుందని నిరూపించబడింది. 

అంతేకాకుండా 718 GTSతో పోల్చితే కారు బరువును 35 కిలోల వరకు తగ్గించడంలో కూడా కంపెనీ కృషి చేసింది. కార్బన్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ (CFRP) బానెట్, ఫ్రంట్ వింగ్స్ వంటి భాగాల కోసం ఉపయోగించారు, దీని ద్వారా కారు బరువును తగ్గించింది. లైట్ వెయిట్ వింగ్స్ కూడా బరువును తగ్గిస్తాయి, అలాగే తుప్పుకు కారణమయ్యే ఇన్సులేషన్ మెటీరియల్ మొత్తాన్ని తగ్గిస్తాయి. వెనుక విండో తేలికైన గాజుతో తయారు చేయబడింది ఇంకా స్టోరేజ్ స్పేస్‌లో టెక్స్‌టైల్ ఓపెనింగ్ లూప్ అండ్ నెట్‌తో డోర్ ప్యానెల్‌లు ఉంటాయి.  20-అంగుళాల  అల్యూమినియం వీల్స్. ముందువైపు 408 ఎంఎం డిస్క్ బ్రేక్‌లు, వెనుకవైపు 380 ఎంఎం డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. 

Latest Videos

click me!