Upcoming Cars:ఎస్‌యు‌విల నుండి ఎలక్ట్రిక్ వాహనాలు, లగ్జరీ వరకు... ఈ 6 గొప్ప కార్లు మేలో లాంచ్ కానున్నాయి

First Published | May 7, 2022, 11:45 AM IST

మే నెల భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమకు సందడితో ఉండనుంది, ఈ నెలలో ఎన్నో పెద్ద లాంచ్‌లు ఉండనున్నాయి. ఎస్‌యూ‌విల నుండి ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రీమియం లగ్జరీ సెడాన్ల వరకు ఎన్నో కొత్త కార్లు ఈ నెలలో విడుదల కానున్నాయి. జీప్, టాటా మోటార్స్, స్కోడా, బిఎమ్‌డబ్ల్యూ, ఆడి వంటి కంపెనీలు భారత మార్కెట్లో కొత్త కార్లను ప్రవేశపెట్టబోతున్నాయి. మే 2022లో ఇండియాలోకి రాబోతున్న కార్ల గురించి  చూద్దాం..
 

స్కోడా కుషాక్ మోంటే కార్లో
కొత్త స్కోడా కుషాక్ మోంటే కార్లో ఎడిషన్ 9 మే  2022న ఇండియాలో విడుదల కానుంది. ఈ కారు కుషాక్ టాప్-స్పెక్ స్టైలింగ్ ట్రిమ్‌పై ఆధారపడి ఉంటుంది. కొన్ని కొత్త ఫీచర్‌లతో పాటు ఎన్నో కాస్మెటిక్ అప్‌డేట్‌లను పొందుతుంది. ఈ స్పెషల్ ఎడిషన్ SUV 1.0-లీటర్ TSI, 1.5-లీటర్ TSI ఇంజన్ ఆప్షన్‌లతో పాటు అన్నీ రకాల ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ తో అందించబడుతుంది. 
 

మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
కొత్త జనరేషన్ మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ (mercedes-benz c-class) 10 మే 2022న భారత మార్కెట్లో విడుదల కానుంది. దీనికి సంబంధించి ప్రీ బుకింగులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ కారుని 201 hp 1.5-లీటర్ టర్బో పెట్రోల్ మోటార్ (C200), 197 hp 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ (C220d), 261 hp 2.0-లీటర్ ఆయిల్-బర్నర్ (C300d)తో అందించబడుతుంది. అన్ని ఇంజన్లు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. 


టాటా నెక్సాన్ EV మ్యాక్స్
టాటా మోటార్స్ 11 మే 2022న అప్  డెటెడ్ నెక్సాన్ EV ధరలను ప్రకటించనుంది. ఈ కారు అధికారిక పేరు నెక్సాన్ ఈ‌వి మ్యాక్స్ (Nexon EV max). రాబోయే Nexon EV Max పెద్ద 40 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని, ఒక్క ఫుల్ చార్జ్ తో 400 కి.మీ కంటే ఎక్కువ డ్రైవింగ్ పరిధిని అందించగలదని భావిస్తున్నారు. కాస్మెటిక్ అప్‌డేట్‌లు, కొత్త ఫీచర్లు, అప్‌డేట్ చేయబడిన ఛార్జర్‌ను కూడా పొందే అవకాశం ఉంది. 

జీప్ మెరిడియన్
కొత్త జీప్ మెరిడియన్ 7-సీటర్ ఎస్‌యూవీని ఈ నెలాఖరులో విడుదల చేయనున్నారు. దీని కోసం ప్రీ-బుకింగులు అధికారికంగా ఓపెన్ అయ్యాయి. జీప్ కంపాస్ SUVలో ఉపయోగించిన  2.0-లీటర్, ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజన్‌తో మెరిడియన్ శక్తిని పొందుతుంది. ఈ ఇంజన్ 167 హెచ్‌పి పవర్, 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో 6-స్పీడ్ ఎం‌టి అండ్ 9-స్పీడ్ AT ఉంటాయి. 

బి‌ఎం‌డబల్యూ ఐ4
బి‌ఎం‌డబల్యూ గ్రూప్ ఇండియా ఆరు నెలల వ్యవధిలో మూడు ఈ‌విలను ఇండియాలో విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. బి‌ఎం‌డబల్యూ  ఐ‌ఎక్స్ (BMW IX), మినీ కూపర్ ఎస్‌ఈ (mini cooper  SE) తర్వాత మే 26న ఇండియాలో బి‌ఎం‌డబల్యూ ఐ4 (BMW i4) ఎలక్ట్రిక్ సెడాన్‌ను విడుదల చేస్తుంది. BMW i4 రెండు వేరియంట్లలో అందించబడుతుందని భావిస్తున్నారు - ఒకటి eDrive40, M50 xDrive. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 590 కిమీల డ్రైవింగ్ అందించగలదని పేర్కొన్నారు. 
 

ఆడి ఏ8 ఎల్  ఫేస్‌లిఫ్ట్
ఈ జాబితాలోని చివరి కారు ఆడి ఏ8ఎల్ ఫేస్‌లిఫ్ట్. కొత్త ఆడి ఏ8ఎల్ ఫేస్‌లిఫ్ట్ కోసం ప్రీ-బుకింగ్‌లు ఇప్పుడు ఇండియాలో అధికారికంగా రూ. 10 లక్షల టోకెన్ తో  ప్రారంభమయ్యాయి. ఫేస్‌లిఫ్టెడ్ Audi A8 L ఎన్నో కాస్మెటిక్ మార్పులు, కొత్త ఫీచర్లను పొందుతుంది. లగ్జరీ సెడాన్  3.0-లీటర్ TFSI టర్బో పెట్రోల్ ఇంజన్‌తో 340 hp, 540 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

Latest Videos

click me!