హ్యుందాయ్ శాంత్రో (hyundai santro) అనేది చాలా పాపులర్ పేరు. ఈ కారు 1998లో మొదటిసారిగా వచ్చినప్పుడు మొదటి ఇన్నింగ్స్‌లోనే కొరియన్ బ్రాండ్‌ను భారతీయ ఆటో రంగంలో ప్రజాదరణ పొందేల చేసింది. అయితే, 2018లో శాంట్రో మోడల్ ని కొత్త లుక్ లో ప్రవేశపెట్టరు. కానీ ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు.
ఇప్పుడు హ్యుందాయ్ సరఫరా చైన్ అడ్డంకులను తగ్గించే ప్రయత్నంలో కారును నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం ఈ సమస్యపై కంపెనీ ఇంకా అధికారికంగా సమాధానం ఇవ్వలేదు.
తాజాగా శాంట్రో పెట్రోల్‌ను నిలిపివేసినట్లు లీకైన నివేదిక వెల్లడించింది. ఈ కారు సిఎన్‌జి వేరియంట్ సేల్ కొనసాగుతుంది. నివేదిక ప్రకారం, హ్యుందాయ్ డీలర్‌షిప్‌లు కూడా పెట్రోల్ వెర్షన్ స్టాక్ అయిపోయే వరకు విక్రయిస్తున్నట్లు ధృవీకరించాయి. ప్రస్తుతం CNG మోడల్‌పై ఎలాంటి స్పష్టత లేదు.
హ్యుందాయ్ నుండి ప్రస్తుత కార్ల CNG వెర్షన్‌లను పరిగణనలోకి తీసుకుంటే, శాంత్రో ఎంట్రీ-లెవల్ కార్లలో బెస్ట్ ఆప్షన్. కానీ ఉత్పత్తి, లాభాల కోసం కంపెనీ దానిని మళ్లీ రివిజిట్ చేయవచ్చు.
హ్యుందాయ్ శాంత్రో 2018లో రూ. 3.9 లక్షల నుండి రూ. 5.5 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో తిరిగి ప్రారంభించింది. అయితే ఈ రోజుల్లో కరోనా మహమ్మారి, సెమీకండక్టర్ చిప్ కొరత, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతున్నందున, మోడళ్ల ధరలు 20 నుండి 30 శాతం పెరిగాయి.
ఈ కారణాల వల్ల తక్కువగా అమ్ముడవుతున్న ఈ మోడల్ ఉత్పత్తిని నిలబెట్టుకోవడం కంపెనీకి కష్టతరం చేసినట్లు కనిపిస్తోంది. అలాగే కార్లలో 6 ఎయిర్ బ్యాగ్ లను స్టాండర్డ్ గా అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ధరలు మరింత పెరిగాయి.