కొత్త హయబుసా భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్‌బైక్‌లలో ఒకటిగా వారసత్వాన్ని అందిస్తోంది. 2021 హయబుసా 1,340సిసి, ఫోర్-స్ట్రోక్, ఫ్యూయల్-ఇంజెక్ట్, లిక్విడ్-కూల్డ్, డిఓహెచ్‌సి, ఇన్‌లైన్ ఫోర్ ఇంజిన్ 9,700 ఆర్‌పిఎం వద్ద 187 బిహెచ్‌పి, 7,000 ఆర్‌పిఎం వద్ద 150ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ బైక్ టాప్ స్పీడ్ ఇప్పటికీ 299 kmphగా రేట్ చేయబడింది. ఈ సారి బైక్ బరువు 2 కేజీల తగ్గి 264 కిలోలు ఉంటుంది, అయితే భారతీయ మోడళ్లలో నంబర్ ప్లేట్ హోల్డర్, సారి గార్డుతో బరువు 266 కిలోల వరకు ఉంటుంది. అప్ డేట్ ఇంజిన్‌తో పాటు ఈ బైక్ లో ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్స్, సిక్స్-యాక్సిస్ ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్ (IMU)ని కూడా పొందుతుంది.
యూఎస్‌పి అనేది సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ (SIRS) దీని కింద మీరు మూడు రైడింగ్ మోడ్‌లు, మూడు యూజర్-డిఫైనేడ్ మోడ్‌లను పొందుతారు, ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ-లిఫ్ట్ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ మొదలైన వాటి కోసం విభిన్న సెట్టింగ్‌లు ఉంటాయి.
కొత్త సుజుకి హయబుసా లాభాలు, నష్టాలు ఏంటంటే
లాభాలు
1.పర్ఫర్మెంస్ అండ్ హ్యాండ్లింగ్
2.అధునాతన ఎలక్ట్రానిక్స్ సూట్, సిక్స్ - ఆక్సీస్ ఈనెర్షియల్ మెజర్మెంట్ యూనిట్ (IMU)సపోర్ట్
3.బ్రెంబో స్టైలేమా బ్రేక్‌లు ఖచ్చితంగా షాట్ ఆపే శక్తిని అందిస్తాయి.
4.ఆకర్షణీయమైన ట్విన్ అనలాగ్ వాచ్ ఇంకా సెంట్రల్ టిఎఫ్‌టి ప్యానెల్‌తో అప్‌డేట్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్.
5.పోటీ ధర రూ.16.40 లక్షలు (ఎక్స్-షోరూమ్).
నష్టాలు
1.భారతదేశంలో స్టాక్ లభ్యత
2.పెద్ద 1,340సిసి ఇన్‌లైన్ ఫోర్-సిలిండర్ ఇంజిన్ హాట్ గా పనిచేస్తుంది
3.క్లచ్ లివర్‌పై కొంచెం బరువు అనుభూతి అనిపిస్తుంది
4.ట్రాఫిక్‌లో ప్రయాణించడం సౌకర్యంగా ఉండదు