Ola: ఓలా నుంచి నెక్ట్స్ జనరేషన్ స్కూటర్లు.. ఫీచర్స్ అదుర్స్!

Published : Jan 30, 2025, 12:14 PM IST

ఓలా కంపెనీ నెక్ట్స్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనుంది. మూడో జనరేషన్ ప్లాట్ ఫామ్ పై రూపొందించిన ఈ స్కూటర్లను ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  

PREV
14
Ola: ఓలా  నుంచి నెక్ట్స్ జనరేషన్ స్కూటర్లు.. ఫీచర్స్ అదుర్స్!

ప్రముఖ సంస్థ ఓలా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల కానుంది. జనరేషన్ 3 ప్లాట్‌ఫారమ్‌పై దీన్ని రూపొందించారు. ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తన X ఖాతాలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీని ప్రకటించారు.

 

24
ఓలా జెన్ 3

జెన్ 3 ప్లాట్‌ఫారమ్‌పై తయారైన కొత్త స్కూటర్ జనవరి 31 ఉదయం 10:30 గంటలకి విడుదల అవుతుందని భవిష్ అగర్వాల్ తెలిపారు. స్కూటర్ గ్లింప్స్ కూడా చూపించారు. జనరేషన్ 3 టెక్నాలజీ అందుబాటులోకి వస్తే తమ మార్జిన్లు 20 శాతం వరకు పెరుగుతాయని కంపెనీ భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

34
ఓలా ఎలక్ట్రిక్

కొత్త ప్లాట్‌ఫారమ్‌తో S2, S3 సిరీస్‌లు కూడా రావచ్చు. S2లో సిటీ రైడ్, లాంగ్ రైడ్, పెర్ఫార్మెన్స్ మోడల్స్ ఉండవచ్చు. S3లో మాక్సీ స్కూటర్, అడ్వెంచర్ మోడల్స్ లాంటి ప్రీమియం ఉత్పత్తులు ఉండవచ్చు.

44
ఓలా కొత్త స్కూటర్

రెండో జనరేషన్ తో పోలిస్తే మూడో జనరేషన్ స్కూటర్లు మరింత మెరుగ్గా ఉండవచ్చు. జెన్ 3 వాహనాల బ్యాటరీ, మోటార్‌లో మార్పులు ఉండవచ్చు. ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ, మాగ్నెట్ లేని మోటార్ ఉండవచ్చు. ధర ఇంకా ప్రకటించలేదు.

click me!

Recommended Stories