Vehicle Insurance Rules : కారు, బైక్ ఇన్సూరెన్స్‌లో భారీ మార్పులు.. కొత్త రూల్స్ ఇవే..!

Published : Nov 19, 2026, 02:07 PM IST

వచ్చేనెల డిసెంబర్ 15 నుంచి వాహనాల ఇన్సూరెన్స్ నిబంధనలు మారుతున్నాయి. ఇకపై 4 రకాల ఇన్సూరెన్స్‌లు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో ఏది తప్పనిసరి? ఏది ఆప్షనల్? ప్రీమియం పెరుగుతుందా? IRDAI జారీ చేసిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
13
కారు, బైక్ ఇన్సూరెన్స్‌లో కొత్త రూల్స్

ప్రయాణ సమయాల్లో అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి… దీంతో వాహనాాలు డ్యామేజ్ అవుతుంటాయి. కొన్నిసార్లు మరణాలు సంభవిస్తుంటాయి. ఇలాంటి ప్రమాద సమయంలో వాహన యజమానులకు, ప్రయాణికులకు ఆర్థిక భద్రత కల్పించడంలో మోటార్ ఇన్సూరెన్స్ కీలకం. అయితే డిసెంబర్ 15 నుంచి మోటార్ ఇన్సూరెన్స్ విధానంలో భారీ మార్పులు జరగనున్నాయి.

IRDAI తాజా ప్రకటన ప్రకారం… ప్రైవేట్ కార్లు, టూ-వీలర్స్ కోసం 4 అంచెల ఇన్సూరెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. దీనివల్ల కస్టమర్లు తమకు కావాల్సిన కవరేజీని విడివిడిగా ఎంచుకునే వెసులుబాటు కలుగుతుంది.

23
కొత్త విధానం ఎలా ఉంటుంది?

కొత్త రూల్స్ ప్రకారం మోటార్ ఇన్సూరెన్స్‌ను 4 విభాగాలుగా విభజించారు. థర్డ్ పార్టీ కవరేజ్, ప్రయాణికుల కోసం లయబిలిటీ కవరేజ్, పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్, ఓన్ డ్యామేజ్ కవరేజ్ ఉంటాయి.

IRDAI నవంబర్ 2న ఈ మార్పులకు సంబంధించిన సర్క్యులర్‌ను జారీ చేసింది. డిసెంబర్ 15 నుంచి తీసుకునే కొత్త పాలసీలకు ఇది వర్తిస్తుంది.

1. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్: ఇది మునుపటి లాగే తప్పనిసరి. ప్రమాదం వల్ల ఇతరులకు లేదా వారి ఆస్తికి నష్టం జరిగితే ఇది కవర్ చేస్తుంది.

2. ప్యాసింజర్ కవరేజ్ : కారులో లేదా బైక్ వెనుక కూర్చునే వారికి ఇది వర్తిస్తుంది. ఇది ఆప్షనల్ మాత్రమే, తప్పనిసరి కాదు.

3. పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ : వాహన యజమానికి ఇది వర్తిస్తుంది. థర్డ్ పార్టీ లాగే ఇది కూడా తప్పనిసరి.

4. ఓన్ డ్యామేజ్ కవరేజ్ : ప్రమాదం లేదా దొంగతనం వల్ల వాహనానికి జరిగే నష్టాన్ని ఇది కవర్ చేస్తుంది. ఇది కూడా ఆప్షనల్.

33
ప్రీమియం పెరుగుతుందా?

కొత్త రూల్స్ రానుండటంతో ప్రీమియం పెరుగుతుందా అన్న ఆందోళన వాహనదారుల్లో ఉంది. అయితే ప్రీమియం పెంపు లేదా తగ్గింపుపై IRDAI ఎలాంటి ప్రకటన చేయలేదు. ఓన్ డ్యామేజ్ కవరేజ్‌కు ప్రీమియం నిర్ణయించే స్వేచ్ఛను ఇన్సూరెన్స్ కంపెనీలకే వదిలేసింది.

అలాగే డిసెంబర్ 15లోగా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు 'Bima Sugam' అనే ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం కావాలి. దీనివల్ల కస్టమర్లు పాలసీలను ఒకే చోట పోల్చి చూసుకునే అవకాశం ఉంటుంది.

వాహనదారులు గమనించాల్సిన విషయాలు

కొత్త పాలసీ తీసుకునేటప్పుడు థర్డ్ పార్టీ, పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి. మిగతావి మీ అవసరాన్ని బట్టి ఎంచుకోవచ్చు. ప్రతి విభాగానికి అయ్యే ఖర్చును విడివిడిగా చెక్ చేసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories