Best Mileage Bikes: లీటరుకు 65 కి.మీ మైలేజ్, అదిరిపోయే లుక్ తో వచ్చే బెస్ట్ 3 బైక్‌లు ఇవే!

Published : Nov 18, 2026, 05:50 PM IST

Best Mileage Bikes: తక్కువ పెట్రోల్ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకుంటున్నారా? అదిరిపోయే లుక్‌తో పాటు లీటరుకు 65 కి.మీ వరకు మైలేజ్ ఇచ్చే కొన్ని బైక్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అలాంటి బెస్ట్ 3 బైక్‌ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
లీటరుకు 65 కి.మీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ బైక్‌లు

ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బైక్ కొనాలనుకునే చాలామంది మైలేజ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు బైక్ లుక్ కూడా స్టైలిష్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసం మార్కెట్లో కొన్ని అద్భుతమైన మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అదిరిపోయే మైలేజ్, బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో పాటు కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్న టాప్ 3 బైక్స్‌ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

24
హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్

ఇండియాలో ఎన్నో ఏళ్లుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీల నమ్మకాన్ని గెలుచుకున్న స్ప్లెండర్ బైక్ లేటెస్ట్ మోడల్ ఇది. దాదాపు 928 మంది యూజర్ల నుంచి ఈ బైక్ 5 కి 4.6 రేటింగ్ సాధించినట్లు తెలుస్తోంది.

ఇంజిన్ కెపాసిటీ - ఇందులో 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 7.9 bhp పవర్, 8.05 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.

మైలేజ్ & ఫీచర్లు - ఇది లీటరుకు 65 కి.మీ కి పైగా మైలేజ్ ఇస్తూ ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ట్రాఫిక్‌లో పెట్రోల్ ఆదా చేసే i3S టెక్నాలజీ, డిజిటల్ మీటర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కంఫర్టబుల్ సీటింగ్ ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.82,000.

34
హోండా ఎస్పీ 125

125 సీసీ కమ్యూటర్ సెగ్మెంట్‌లో బాగా పాపులర్ అయిన మోడల్ ఇది. ఏకంగా 4,600 మందికి పైగా కస్టమర్లు దీనికి 4.6 రేటింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇంజిన్ కెపాసిటీ - 123.94 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇందులో ఉంది. ఇది 10.87 PS పవర్, 10.9 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు.

మైలేజ్ & ఫీచర్లు - ఇది లీటరుకు దాదాపు 63 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఎల్ఈడీ హెడ్‌లైట్స్, డిజిటల్ మీటర్ కన్సోల్, గేర్ పొజిషన్ ఇండికేటర్, రియల్ టైమ్ మైలేజ్ చూపే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని ధర రూ.93,000.

44
హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్

కాలేజీ కుర్రాళ్లను ఆకట్టుకునేలా స్పోర్టీ లుక్‌తో ఈ బైక్ డిజైన్ చేశారు. దాదాపు 1,944 మంది కస్టమర్ల దీనికి 4.6 రేటింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇంజిన్ కెపాసిటీ - ఇందులో 124.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 11.4 bhp పవర్, 10.5 Nm టార్క్ ఇస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

మైలేజ్ & ఫీచర్లు - గంటకు 100 కి.మీ టాప్ స్పీడ్‌తో వెళ్లే ఈ బైక్.. లీటరుకు 57 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. అగ్రెసివ్ డిజైన్, ఎల్ఈడీ లైట్స్, డిజిటల్ మీటర్, సేఫ్టీ కోసం సింగిల్-ఛానల్ ఏబీఎస్ బ్రేకింగ్ ఇందులో మెయిన్ ఫీచర్లు. ధర రూ.99,000.

ఏది బెస్ట్?

ఎక్కువ మైలేజ్ (65 కి.మీ), తక్కువ మెయింటెనెన్స్ కోరుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, రోజూ లాంగ్ జర్నీ చేసే వారికి హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ సూపర్ ఆప్షన్.

పవర్, మైలేజ్, స్మూత్ ఇంజిన్ సమానంగా కావాలనుకునే డైలీ ఆఫీస్ యూజర్లకు హోండా ఎస్పీ 125 కరెక్ట్ చాయిస్.

తక్కువ బడ్జెట్‌లో స్పోర్ట్స్ బైక్ లుక్, స్పీడ్‌తో పాటు మంచి మైలేజ్ కావాలనుకునే యూత్‌కి హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories