కొత్త జనరేషన్ సుజుకి ఆల్టో జనవరి 2022లో ఆవిష్కరించనున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే దీనిపై సుజుకీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. 9వ జనరేషన్ ఆల్టో లైట్ HEARTECT ప్లాట్‌ఫారమ్ మెరుగైన వెర్షన్‌పై ఆధారపడి ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్ పై ఇండియా-స్పెక్ సుజుకి ఎస్-ప్రెస్సో (suzuki S-presso), కొత్త వ్యాగన్ఆర్ (waganr) కూడా ఉపయోగించారు.
కొత్త లుక్ ఎలా ఉందంటే..
లీకైన ఫోటోలో కొత్త జనరేషన్ సుజుకి ఆల్టో పాత మోడల్ కంటే మెరుగ్గా కనిపిస్తోంది. అయితే బాక్సీ ఆకారం, పొడవైన లుక్ ఉంది. ఈ చిన్న కారుకి రెండు పెద్ద హెడ్‌ల్యాంప్‌ల మధ్య క్రోమ్ బార్‌తో చిన్న ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ వైట్ రూఫ్‌తో డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఇంకా 7-స్పోక్ వీల్స్, అయిరీ ఫ్రీ కోసం పెద్ద విండో గ్లాసెస్, ర్యాప్-అరౌండ్ టెయిల్-లైట్లను పొందుతుంది.