2022లో హీరో మోటోకార్ప్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్.. తైవాన్ కంపెనీతో ఒప్పందం..

First Published Nov 13, 2021, 4:43 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (hero motorcorp)మార్చి 2022 నాటికి భారత మార్కెట్లో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌(electric scooter)ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. హీరో మోటోకార్ప్ శుక్రవారం పత్రికా ప్రకటనలో ఈ వార్తను ధృవీకరించింది.

భారతీయ మార్కెట్లో ప్రముఖ బైక్ అయిన హీరో స్ప్లెండర్ తయారీ సంస్థ ఎలక్ట్రిక్ వాహన ప్రాజెక్ట్ ఇప్పటికే అధునాతన దశలో ఉందని ధృవీకరించింది. ఈ ఉత్పత్తి దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఉన్న ప్లాంట్‌లో తయారు చేయనుంది.

ఇటీవల భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో  ఎలక్ట్రిక్ స్కూటర్  మొదటి గ్లింప్స్ చూపించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బ్యాటరీ స్వాప్ టెక్నాలజీతో మరిన్ని ఫీచర్లను పంచుకోవడానికి టెక్ దిగ్గజం తైవాన్ కంపెనీ గొగోరోతో కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. 

హీరో  మొదటి ఎలక్ట్రిక్ వాహనం అంతకుముందు షేర్ చేసిన కాన్సెప్ట్‌పై  ఆధారపడి ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఫైనల్ ప్రాడక్ట్ -స్పెక్ మోడల్ సింగిల్-సైడ్ స్వింగార్మ్‌ను పొందే అవకాశం ఉంది. కానీ పూర్తి-ఎల్‌ఈ‌డి లైటింగ్, ఫాస్ట్ ఛార్జింగ్, లాంగ్ రేంజ్, మార్చుకోగలిగిన బ్యాటరీ ప్యాక్‌ని పొందగలదని భావిస్తున్నారు.

లాంచ్ తరువాత హీరో మొదటి ఈ‌వి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ (bajaj chetak electric), ఏథర్ 450X (ather ​​450X), టి‌వి‌ఎస్ ఐక్యూబ్(TVS iQube) వంటి ఇప్పటికే ప్రజాదరణ పొందిన వాహనాలతో గట్టి పోటీనిస్తుంది. హీరో కూడా  ప్రత్యర్థులతో సరిపెట్టుకోవడానికి స్కూటర్ ధరలను దూకుడుగా నిర్ణయిస్తుంది. అయితే స్కూటర్ ధర రూ.1 లక్షలోపు ఉంటుందని అంచనా.

హీరో మోటోకార్ప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) నిరంజన్ గుప్తా మాట్లాడుతూ, “మొబిలిటీ ఫ్యూచర్ గా ఉండాలనే వ్యూహాత్మక దృష్టికి అనుగుణంగా హీరో మోటోకార్ప్  కార్బన్ న్యూట్రాలిటీ, సస్టేనబిలిటీ మార్గాన్ని కొనసాగిస్తుంది. కంపెనీ పరిశోధన, అభివృద్ధి నుండి గ్రీన్ వాహనాల ఉత్పత్తికి సమగ్ర విధానాన్ని తీసుకుంటోంది, ఇందులో వ్యూహాత్మక సహకారాలు, భాగస్వామ్యాలు కూడా ఉన్నాయి."అని అన్నారు.

click me!