మరో వివాదాస్పద ట్వీట్‌లో చిక్కుకున్నా టెస్లా చీఫ్.. ఇంటర్నెట్ లో ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు..

Ashok Kumar   | Asianet News
Published : Nov 15, 2021, 03:11 PM ISTUpdated : Nov 15, 2021, 03:15 PM IST

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెస్లా (tesla)అధినేత ఎలోన్ మస్క్(elon musk) ఆదివారం మరో వివాదాస్పద ట్వీట్‌లో చిక్కుకున్నారు. పన్నుపై అమెరికా చట్టసభ సభ్యుడు బెర్నీ శాండర్స్ (berne sanders)చేసిన ట్వీట్‌ పై   షాకింగ్ రిప్లై ఇచ్చాడు. 80 ఏళ్ల శాండర్స్‌ను  "మీరు ఇంకా బతికే ఉన్నారని సంగతి నేను మర్చిపోతున్నాను," అంటూ పేర్కొన్నాడు.  

PREV
15
మరో వివాదాస్పద ట్వీట్‌లో చిక్కుకున్నా టెస్లా చీఫ్.. ఇంటర్నెట్ లో ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు..

ట్విట్టర్‌లో టెస్లా చీఫ్‌ ఎలోన్ మస్క్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి అతడిని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ ట్వీట్ తర్వాత మాజీ సాండర్స్ ఉద్యోగి అండ్ కార్యకర్త మెలిస్సా బైర్న్ - 'టెస్లా కార్లను కొనుగోలు చేయవద్దు,' అంటూ పోస్ట్ చేశారు.
    
  నిజానికి యూ‌ఎస్ లా మేకర్ బెర్నీ సాండర్స్ తన ట్విట్టర్ లో  మేము గొప్ప వారు న్యాయమైన పన్ను వాటాను చెల్లించాలని డిమాండ్ చేయాలి  అంటూ పోస్ట్ చేశారు.
 

25

ఏడు మిలియన్ల షేర్లను విక్రయించిన మస్క్
ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ పన్నులు చెల్లించడానికి ఈ వారం కంపెనీలో తన వాటాలలో దాదాపు ఏడు మిలియన్ల షేర్లను విక్రయించాడు. అతను తన షేర్లను విక్రయించే ముందు ట్విట్టర్‌లో పోల్ కూడా నిర్వహించాడు, ఇందులో మరిన్ని షేర్లను విక్రయించాలా అని తన ఫాలోవర్స్ ని కోరాడు.
 

35

మరిన్ని షేర్లను విక్రయించాలా అని యూ‌ఎస్ ఎం‌పిని కోరిన మస్క్
పన్నుపై యూ‌ఎస్ చట్టసభ సభ్యుడు బెర్నీ శాండర్స్ చేసిన ట్వీట్ తరువాత టెస్లా చీఫ్ వివాదాస్పద ట్వీట్ చేయడమే కాకుండా బెర్నీ శాండర్స్ ని నా మరిన్ని షేర్లను కూడా విక్రయించాలనుకుంటున్నావా  అని కూడా పోస్ట్ చేశారు. 

45

ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ పై  ట్విట్టర్‌లో చాలా మంది మళ్లీ ట్రోల్ చేయడం ప్రారంభించారు. పన్నులు చెల్లించడానికి తన టెస్లా హోల్డింగ్‌లలో 10% విక్రయించాలా అని ఎలోన్ మస్క్ గత వారం ట్విటర్‌ ఫాలోవర్స్ ని అడిగాడు అయితే  అతని పోల్‌లో 58% మంది అవును అని ప్రతిస్పందించారు.
 

55

"ప్రపంచంలోని అత్యంత సంపన్నుడు ఏదైనా పన్నులు చెల్లించాలా వద్దా అనేది ట్విట్టర్ పోల్ ఫలితాలపై ఆధారపడి ఉండకూడదు" అని ఎలోన్ మస్క్ చేసిన ట్విట్టర్ పోల్‌కు ప్రతిస్పందనగా ఒరెగాన్‌కు చెందిన సేన్. రాన్ వైడెన్ ట్వీట్ చేశారు.  

click me!

Recommended Stories