ఈ హిరోయిన్ల ఇళ్లే కాదు.. లగ్జరీ కార్లు కూడా యమ కాస్ట్లీ.. ఒక్కో కారు ధర ఎంతంటే ?

First Published | Sep 13, 2021, 4:02 PM IST

బాలీవుడ్ తారల విలాసవంతమైన లైఫ్ స్టయిల్  గురించి  కొత్తగా చెప్పనవసరంలేదు. పెద్ద ఇళ్ళు మాత్రమే కాకుండా లక్షల కోట్ల కార్లు వారి ఇంటి గ్యారేజీలో కనిపిస్తాయి. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా లగ్జరీ కార్లను ఇష్టపడతారు. 

హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా లగ్జరీ కార్లను ఇష్టపడతారు. తాజాగా కృతి సనన్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎస్‌యూ‌వి మెర్సిడెస్-మేబాచ్ జి‌ఎల్‌ఎస్ 600ని కొనుగోలు చేసింది. దీని ధర సుమారు 2.43 కోట్లు.

ఈ లగ్జరీ కారు కొన్న మొదటి నటి

ఈ కారును కొనుగోలు చేసిన మొదటి బాలీవుడ్ నటి కృతి సనన్. ఈ కారు ఈ‌క్యూ బూస్ట్ ఇంజిన్‌తో శక్తివంతమైన 4.0ఎల్ వి‌8 బిటర్బో ద్వారా శక్తిని పొందుతుంది. ఇటీవలి కాలంలో చాలా మంది తారలు ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ జి‌ఎల్‌ఎస్ 600 గురించి మాట్లాడి‌తే కృతి సనన్ కి ముందు అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్ కూడా ఈ కారును కొనుగోలు చేసారు. రణ్వీర్ సింగ్, దీపిక పదుకొనే ఇద్దరూ తరచుగా ఒకే కారులో కనిపిస్తారు. అయితే ఈ రోజు విలాసవంతమైన కార్ల కలెక్షన్ ఉన్న సెలెబ్రిటిల గురించి తెలుసుకుందాం...


సారా అలీ ఖాన్

సారా అలీ ఖాన్ లేటెస్ట్ మోడల్ మెర్సిడెస్ బెంజ్-జి వాగన్ కార్ ఉంది. ఈ కారు బయటి నుండి చూస్తే కనిపించే విధంగా రెట్రో డిజైన్‌ను పొందింది, అంతే కాదు ఈ కారు లోపల చాలా ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు డాష్‌బోర్డ్‌లో రెండు పెద్ద స్క్రీన్‌లు ఉంటాయి. ఈ ఫీచర్ ఇతర ఆధునిక మెర్సిడెస్ బెంజ్ కార్లలో కూడా చూడవచ్చు.

ప్రియాంక చోప్రా

లగ్జరీ కార్లను ఇష్టపడే ప్రియాంక చోప్రా కార్లు కోట్ల విలువైనవి. వీటిలో రోల్స్ రాయిస్ ఘోస్ట్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, పోర్షే కయెన్ వంటి లగ్జరీ వాహనాలు ఉన్నాయి.

దీపికా పదుకొనే

భర్త రణ్‌వీర్ సింగ్ లాగే  దీపికకు మెర్సిడెస్ నుండి ఆడి వరకు ఎన్నో లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. దీపికకు మెర్సిడెస్ మేబాచ్ 500 కూడా ఉంది. భారతదేశంలో మెర్సిడెస్ మేబాచ్ 500 ధర రూ .1.94 కోట్ల నుండి రూ .2.15 కోట్ల వరకు ఉంటుంది.

అలియా భట్

బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అలియా భట్ ప్రముఖ సినీ దర్శకుడు మహేష్ భట్, నటి సోని రజ్దాన్ కుమార్తె. ఆలియా భట్ చిన్న వయసులోనే భారీ సంపదను సంపాదించింది. అలియాకు రేంజ్ రోవర్ వోగ్ వంటి లగ్జరీ వాహనం ఉంది.

కరీనా కపూర్ ఖాన్

కరీనా కపూర్ ఖాన్ ఖరీదైన కార్లలో లగ్జరీ వాహనాలు కూడా ఉన్నాయి. కరీనా కారు కలెక్షన్ లో సరికొత్త వాహనం మెర్సిడెస్- ఏ‌ఎం‌జి జి63ని ఈ సంవత్సరంలో కొనుగోలు చేసింది. ఈ కారు ధర సుమారు రూ .2 కోట్లు.

Latest Videos

click me!