Mileage: ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా మైలేజ్ పెర‌గ‌డం లేదా.? అయితే మీరు ఈ త‌ప్పులు చేస్తున్న‌ట్లే

Published : Jan 23, 2026, 12:16 PM IST

Mileage: సాధారణ మార్పులతో మీ బైక్, కారు మైలేజీని పెంచుకోవచ్చు. అనవసరమైన బరువు, తప్పుడు ఇంజిన్ ఆయిల్ వాడకాన్ని నివారించడం ఇంధన ఆదాకు బాగా సాయపడుతుంది. మైలేజ్ ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.

PREV
16
మైలేజ్ ఎలా పెంచాలి?

పెట్రోల్ ధర రూ.100 దాటిన ఈ టైంలో, మైలేజ్ కొంచెం ఎక్కువ రావాలని బైక్, కార్ నడిపేవారందరికీ ఒకటే టెన్షన్. రోజూ ఆఫీసుకు వెళ్లాలన్నా, లాంగ్ రైడ్‌కు వెళ్లాలన్నా ఇంధన ఖర్చు ఇబ్బంది పెడుతుంది. కానీ నిజం ఏంటంటే, మైలేజ్ పెంచడానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. మనం నడిపే పద్ధతిలోనే కొన్ని చిన్న మార్పులు చేస్తే చాలు.

26
టైర్ ప్రెజర్ సరిగ్గా ఉంచండి

టైర్ ప్రెజర్ సరిగ్గా లేకపోతే బండి ఫ్రీగా రోల్ అవ్వదు. ప్రెజర్ తక్కువగా ఉంటే టైర్ రోడ్డుపై లాగుతుంది, ఇంజిన్‌పై ఎక్కువ భారం పడి ఇంధనం ఎక్కువ ఖర్చవుతుంది. అదే సమయంలో ఎక్కువ ప్రెజర్ ఉన్నా గ్రిప్, కంఫర్ట్ తగ్గి, బ్రేకింగ్ పెరిగి మైలేజ్ దెబ్బతింటుంది. అందుకే గాలి తగ్గిందనిపించినప్పుడే కాకుండా, 2 వారాలకొకసారి ప్రెజర్ చెక్ చేయండి. బైక్, కారుకు సిఫార్సు చేసిన PSI మెయిన్‌టెయిన్ చేయాలి. సరైన ప్రెజర్ ఉంటే పికప్ స్మూత్‌గా ఉంటుంది.

36
ఈ అలవాటుకు గుడ్‌బై చెప్పండి

ట్రాఫిక్‌లో చాలామంది చేసే తప్పు హాఫ్-క్లచ్ రైడింగ్. బైక్‌లో క్లచ్ సగం పట్టుకుని నడపడం వల్ల ఘర్షణ పెరిగి, ఇంజిన్ పవర్ వీల్స్‌కు పూర్తిగా వెళ్లదు, పెట్రోల్ వృథా అవుతుంది. కారులో కూడా ఆకస్మిక యాక్సిలరేషన్, సడెన్ బ్రేకులు మైలేజ్‌ను తగ్గిస్తాయి. సిగ్నల్ దగ్గరికి వచ్చే ముందే వేగాన్ని తగ్గిస్తే బ్రేక్ వాడకం తగ్గుతుంది. అనవసరంగా క్లచ్ పట్టుకోకుండా, సరైన గేర్ వాడండి. ఇది పాటిస్తే పెట్రోల్ ఆదా స్పష్టంగా కనిపిస్తుంది.

46
ఎయిర్ ఫిల్టర్ & సర్వీస్ టైమింగ్

మైలేజ్ తగ్గడానికి కొన్నిసార్లు ఇంజిన్‌కు స్వచ్ఛమైన గాలి అందకపోవడమే కారణం. ఎయిర్ ఫిల్టర్ మురికిగా ఉంటే ఇంజిన్ పనితీరు తగ్గి, ఎక్కువ ఇంధనాన్ని వాడుతుంది. అందుకే సర్వీస్‌లో ఎయిర్ ఫిల్టర్ చెక్ చేయమని చెప్పండి. లేట్ సర్వీస్ కూడా మరో కారణం. ఇంజిన్ ఆయిల్ మార్చడం ఆలస్యం చేయడం, చైన్ లూబ్రికేషన్ (బైక్), వీల్ అలైన్‌మెంట్ (కార్) వంటివి మైలేజ్‌ను తగ్గిస్తాయి. టైమ్‌కు సర్వీస్ చేయిస్తే ఇంజిన్ స్మూత్‌గా పనిచేసి ఇంధనం ఆదా అవుతుంది.

56
ఇంజిన్ ఆయిల్ నాణ్యత + రైడింగ్ వేగం

చాలామంది చేసే పెద్ద తప్పు ఏ ఆయిల్ వేసినా పర్లేదనుకోవడం. సరైన ఇంజిన్ ఆయిల్ లేకపోతే ఇంజిన్ ఫ్రీగా రన్ అవ్వదు. మరీ చిక్కటి ఆయిల్ వేస్తే ఇంజిన్‌పై లోడ్ పెరిగి మైలేజ్ తగ్గుతుంది. తయారీదారు సిఫార్సు చేసిన గ్రేడ్ ఆయిల్ (బైక్/కార్ మాన్యువల్‌లో ఉంటుంది) మాత్రమే వాడండి. ఇక వేగం.. మరీ నెమ్మదిగా లేదా మరీ వేగంగా వెళ్లినా మైలేజ్ రాదు. స్థిరమైన వేగాన్ని పాటించడం ముఖ్యం.

66
కార్ మైలేజ్ పెంచడానికి

సడెన్ పికప్, సడెన్ బ్రేక్ ఉంటే మైలేజ్ పడిపోతుంది. స్మూత్ డ్రైవింగే అసలు రహస్యం. బైక్‌పై బరువైన క్యారియర్, అనవసరమైన వస్తువులు ఉంచడం మైలేజ్‌ను తగ్గిస్తుంది. కారులో కూడా డిక్కీలో అనవసరమైన వస్తువులు ఉంచితే వాహనం బరువు పెరిగి ఇంధన వినియోగం ఎక్కువవుతుంది. రూఫ్ ర్యాక్ ఉన్నా మైలేజ్ తగ్గుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories