క్రెటా, కియా, జీప్ కాంపస్ పోటీగా ఎంజి మోటార్స్ లేటెస్ట్ ఎస్‌యూవీ.. దీని ఫీచర్స్ చూస్తే వావ్ అంటారు..

First Published | Jul 24, 2021, 11:25 AM IST

ఆటోమోబైల్ తయారీ కంపెనీ ఎంజి మోటార్ నుండి త్వరలో రానున్న కొత్త 5 సీట్ల ఎస్‌యూవీ ఎమ్‌జి వన్ 30 జూలై 2021న ప్రపంచవ్యాప్త ఎంట్రీ  ఇవ్వనున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. తొలిసారిగా ఎంజీ మోటార్ కొత్త ఎస్‌యూవీకి సంబంధించిన కొన్ని తాజా టీజర్ ఫోటోలను విడుదల చేసింది. ఈ ఫోటోలు బ్రాండ్  లేటెస్ట్ డిజైన్ అండ్ టెక్నాలజి సామర్థ్యాలను వెల్లడిస్తాయి.

ఎమ్‌జి వన్ ఎస్‌యూవీ ఫోటోలు ఇప్పటికే చైనాలో లీక్ అయ్యాయి. ప్రతుత్తం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఆల్-వన్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ సరికొత్త సిగ్మా ఆర్కిటెక్చర్ ఆధారంగా ఈ కొత్త ఎస్‌యూవీ ఉంటుంది. ఇంకా ఎమ్‌జి ప్రత్యేకంగా దృష్టి సారించే ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. శక్తివంతమైన చిప్ టెక్, యాక్టివ్ డిజిటల్ ఎకో సిస్టమ్, అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్ అండ్ హార్డ్-కోర్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ వంటి అధునాతన టెక్నాలజీలకు ఈ ప్లాట్‌ఫాం ఉత్తమంగా సపోర్ట్ చేస్తుంది.
ఫైనల్ ప్రొడక్షన్-స్పెక్ ఎంజి వన్ ఔటర్ డిజైన్ చాలా భిన్నంగా ఉంటుందని తాజా టీజర్ ఫోటోలు వెల్లడిస్తున్నాయి. అంతకుముందు కనిపించిన ఫోటోలలో లూక్స్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్టీరియర్ కీ మోడల్ ఇంకా బ్రైట్ కలర్ ఆప్షన్స్ అండ్ త్రి డైమెన్షియల్ ఎఫెక్ట్, స్పోర్టి లుకింగ్ ఫ్రంట్ మెయిన్ గ్రిల్ హై లెట్ గా నిలుస్తాయి. ఈ కార్ సైజ్ సంబంధించినంతవరకు ఎమ్‌జి వన్ సైజ్ భారతదేశంలో ఆస్టర్ రాబోయే వెర్షన్‌తో సమానంగా ఉంటుంది.

అయితే దీని ఇంజన్ ఫీచర్స్ 30 జూలై 2021న తెలుస్తాయి. అయితే ఈ ఎస్‌యూవీకి 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ లభిస్తుందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ ఇంజన్ 178 బిహెచ్‌పి శక్తిని, 250 నుండి 260 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ కి 6-స్పీడ్ ఎమ్‌టి అండ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇవ్వవచ్చు. మీడియా నివేదికల ప్రకారం ఎంజి వన్ ఎస్‌యూ‌వి పొడవు 4,579 ఎం‌ఎం, వెడల్పు 1,866 ఎం‌ఎం, ఎత్తు 1,609 ఎం‌ఎం. ఎంజీ వన్ ఎస్‌యూవీకి వీల్‌బేస్ 2,670 ఎంఎం లభిస్తుంది.
ఎంజి కొత్త 5-సీట్ల ఎస్‌యూవీలో అనేక ఫీచర్లను అందించవచ్చు. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్డ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి. భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, జీప్ కంపాస్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పోటీ పడనుంది.

Latest Videos

click me!