క్యాబిన్ ఎలా ఉంటుందంటే:
మసెరటి గ్రెకేల్ క్యాబిన్‌ను ప్రీమియం, లగ్జరీ చేయడానికి ప్రతి ప్రయత్నం జరిగింది. మెమరీ ఫంక్షన్‌తో వచ్చే 10-వే పవర్డ్ ఫ్రంట్ సీట్లు, 12 అంగుళాల డ్యూయల్ స్క్రీన్ ఇందులో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం మరొకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. హెడ్-అప్-డిస్‌ప్లే (HUD), డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 14 స్పీకర్లు దీన్ని మరింత సూపర్ చేస్తాయి. అల్యూమినియం పాడిల్ షిఫ్టర్లు కూడా ఇచ్చారు. సేఫ్టీ పరంగా ఈ SUV లెవెల్-1 అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) సూట్ పొందుతుంది.
ప్రీ-కాన్ఫిగర్డ్ కార్స్ ఇప్పటికే అమ్మకానికి ఉన్నాయని కంపెనీ తెలిపింది. అయితే కస్టమర్లు వారి సెలక్షన్ ప్రకారం ఈ కారును కస్టమైజ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంటుంది. అయితే కస్టమైజ్డ్ మోడల్ డెలివరీ కోసం దాదాపు 5 నుంచి 8 నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.