డ్యూక్, బుల్లెట్ కంటే మించి.. ఇండియాలోనే ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్..

First Published | Jul 31, 2024, 6:41 PM IST

Ultraviolette F77 Mach 2 భారతదేశపు అత్యంత వేగవంతమైన, అందరికి అందుబాటులో ఉండే ధరకే  వస్తున్న ఎలక్ట్రిక్ బైక్.

Ultraviolette F77 Mach 2 భారతదేశపు అత్యంత వేగవంతమైన, అందరికి అందుబాటులో ఉండే ధరకే  వస్తున్న ఎలక్ట్రిక్ బైక్. ఈ బైక్  భారతదేశపు ఫాస్టెస్ట్  ఎలక్ట్రిక్ బైక్ అయినప్పటికీ కొత్త స్టైలింగ్ అండ్ లేటెస్ట్ అప్‌డేట్‌లతో వస్తుంది. Ultraviolette F77 Mach 2 బైక్ 155 km/h స్పీడ్  అందుకోగలదు.
 

 షార్ప్ & ఫార్వర్డ్-స్వీప్ట్ సైడ్ ఫెయిరింగ్స్, లో-స్లంగ్ హెడ్‌ల్యాంప్‌లు, షార్ప్‌ రేక్డ్  చేసిన టెయిల్‌తో సరైన స్పోర్ట్‌బైక్ లాగా కనిపిస్తోంది. యూనిక్ ఫోర్క్ కవర్లు స్టైలింగ్‌కు మరింత లుక్ అందిస్తాయి. దీని స్టాండర్డ్ మోడల్ 27kW పవర్, 90Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.
 


 మాక్ 2 రీకాన్ వేరియంట్ ఎలక్ట్రిక్ మోటార్ నుండి 30kW, 100Nm అవుట్‌పుట్‌ అందిస్తుంది. స్టాండర్డ్ బైక్ 7.1kWh బ్యాటరీ ప్యాక్‌ని, రీకాన్ 10.3kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. Ultraviolette F77 Mach 2లో ప్రస్తుతం ఉన్న  ఫీచర్స్  చూడవచ్చు. ముఖ్యంగా బ్లూటూత్ కనెక్టివిటీ ఇంకా  బ్రైట్‌నెస్ అడ్జస్ట్  ఉంది.
 

ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో 10 లెవల్ రీజెనరేటివ్ బ్రేకింగ్, ఫోర్ లెవల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. పైన పేర్కొన్న ఫీచర్లు కాకుండా, F77 Mach 2 వేరియంట్‌లో మూడు రైడ్ మోడ్‌లు, ఐదు-అంగుళాల TFT, ఆటో-డిమ్మింగ్ లైట్లు, హిల్ హోల్డ్, ABS, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉన్నాయి.
 

ఇతర ఫీచర్లలో ఫుల్ LED లైటింగ్ సిస్టమ్, 3 రైడింగ్ మోడ్స్, 3kW ఫాస్ట్ ఛార్జర్, పార్కింగ్ అసిస్ట్, డాక్యుమెంట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ & డ్యూయల్-ఛానల్ ABS ఉన్నాయి. అల్ట్రావైలెట్ ఎఫ్77 మ్యాక్ 2 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.2.99 లక్షలు (ఎక్స్-షోరూమ్), మ్యాక్ 2 రీకాన్ ధర రూ.3.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్స్  KTM 390 డ్యూక్ లేదా రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 వంటి వాటి కంటే కాస్ట్లీ.
 

Latest Videos

click me!