ఈ తరుణంలో దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమైంది. కంపెనీ అత్యధికంగా అమ్ముడవుతున్న టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్ వాగన్ఆర్ ను ఎలక్ట్రిక్ అవతార్ లో త్వరలో లాంచ్ చేయడానికి సిద్దమైంది.
అయితే మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాగన్ఆర్ కారు లాంచ్ వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ కారు త్వరలోనే భారతీయ మార్కెట్లో విడుదల కానుంది. మారుతి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ విడుదల చేయడానికి ముందు వాగన్ఆర్ ఇవి ప్రొడక్షన్ వెర్షన్ యూనిట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. సాధారణ వాగన్ఆర్ కార్ లాగా కనిపించే ఈ ఎలక్ట్రిక్ వాగన్ఆర్ కార్ తెలుపు రంగు హ్యాచ్‌బ్యాక్ ని లీకైన ఫోటోలలో చూడవచ్చు. కారు ఈవి బ్రాండింగ్ కారు ముందు ఇంకా వెనుక భాగంలో చూడవచ్చు. మారుతి సుజుకి వాగన్ఆర్ ఇవి చాలా కాలంగా దేశంలో టెస్టింగ్ లో ఉంది. కొంతకాలం క్రితం ఇతర రాష్ట్రాలలో కూడా పరీక్ష సమయంలో ఈ కారు కనిపించింది.
మారుతి సుజుకి గత ఏడాది ఇండియాలో 50 జెడిఎం-స్పెక్ ప్రోటోటైప్‌లను ప్రవేశపెట్టింది. గత నివేదికల ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును మొదట బిజినెస్ ఉపయోగం, ఫ్లీట్ మేనేజ్‌మెంట్ (క్యాబ్ సర్వీస్) కోసం విడుదల చేయనున్నట్లు మారుతి సుజుకి పేర్కొంది. ఇది రెగ్యులర్ కార్ల నుండి మరింత డేటాను సేకరించడానికి, కారును మెరుగుపరచడానికి వాహన తయారీదారులకు సహాయపడుతుంది. ఆ తర్వాత కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును వ్యక్తిగత ఉపయోగం కోసం లాంచ్ చేస్తుంది. అయితే, ప్రస్తుతానికి ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ గురించి కంపెనీ పెద్దగా సమాచారం వెల్లడించలేదు.
బ్యాటరీ, డ్రైవింగ్ రేంజ్అయితే నివేదిక ప్రకారం బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత వాగన్ఆర్ ఇవి 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. ఈ డ్రైవింగ్ రేంజ్ దేశంలో వ్యక్తిగత, వాణిజ్య ఉపయోగం కోసం బెస్ట్ సిటీ ఎలక్ట్రిక్ కారుగా అవతరిస్తుంది. స్టాండర్డ్ ఛార్జర్ ద్వారా ఈ హ్యాచ్‌బ్యాక్ కారు బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 7 గంటలు సమయం పడుతుందని భావిస్తున్నారు. ఇంకా ఫాస్ట్ ఛార్జర్ తో ఒక గంటలో 0 నుండి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేస్తుందని భావిస్తున్నారు.
లాంచ్ ఇంకా ధరరిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో వ్యాగన్ఆర్ ఇ.విని భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్స్తున్నాయి. వాగన్ఆర్ ఈవీ ధర రూ .9 లక్షల నుంచి ప్రారంభం కానుంది. మారుతి భవిష్యత్తులో మరిన్ని ఈవి కార్లను లాంచ్ చేయవచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ నెమ్మదిగా పెరుగుతోంది. అలాగే 2021 సంవత్సరంలో చాలా ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు, ఇది ఈవి కార్ల మార్కెట్‌ను పెంచుతుందని భావిస్తున్నారు. టాటా నెక్సాన్ ఇ.వి, హ్యుందాయ్ కోన వంటి ఇ.వి.లతో పాటు ఇతర కొత్త కార్లను భారతీయ రోడ్లపై చూడవచ్చు.