మారుతి సుజుకి కార్ల ధరలకు రెక్కలు.. ఒక్క ఏడాదిలో మూడుసార్లు పెంపు.. కొత్త ధర ఎంతంటే ?

First Published Jul 27, 2021, 8:00 PM IST

 దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ నెల ప్రారంభంలో ఎంచుకున్న కొన్ని కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో స్విఫ్ట్ వేరియంట్‌తో పాటు మొత్తం సిఎన్‌జి లైనప్‌లోని అన్ని మోడళ్ల ధరలను కంపెనీ పెంచింది. ఇప్పుడు వేరియంట్ల ఆధారంగా ధరల పెరుగుదల గురించి సమాచారాన్ని వెల్లడించింది. 

భారత మార్కెట్లో జనాదరణ పొందిన, అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన మారుతి సుజుకి స్విఫ్ట్ ధర రూ .15 వేల వరకు పెరగనుంది. నివేదిక ప్రకారం, ధరల పెరుగుదల ప్రతి వేరియంట్ నుండి వేరియంట్‌కు మారుతుంది.ధరల పెంపు నిర్ణయానికి సంబంధించి, వివిధ ఇన్పుట్ ఖర్చులు పెరగడం వల్ల వాహనాల ధరలు పెరిగాయని కంపెనీ తెలిపింది. మారుతి సుజుకి ఈ ఏడాది మూడోసారి కార్ల ధరలను పెంచింది. అంతకుముందు జనవరి 2021లో కంపెనీ ఎంచుకున్న మోడళ్ల ధరలను రూ .34 వేల వరకు పెంచింది. దీని తరువాత ఏప్రిల్ నెలలో కూడా ఇన్పుట్ ఖర్చులు పెరిగినట్లు పేర్కొంటూ కంపెనీ ధరలను పెంచింది.
undefined
మీడియా నివేదికల ప్రకారం స్విఫ్ట్ కార్ల ప్రస్తుత ధరపై రూ .15 వేల వరకు పెరుగుతుంది. వీటిలో Vxi, Vxi AMT, Zxi, Zxi AMT, Zxi Plus, Zxi Plus AMT, Zxi Plus డ్యూయల్-టోన్ ఉన్నాయి. కాగా తక్కువ వేరియంట్ ధరను రూ .8 వేలు పెంచారు, జెక్సీ ప్లస్ ఎఎమ్‌టి డ్యూయల్ టోన్ వేరియంట్‌పై కనీసం రూ .1000 పెరుగుదల ఉండనుంది.
undefined
మారుతి స్విఫ్ట్ కొత్త ఫేస్ లిఫ్ట్ మోడల్ ని కంపెనీ విడుదల చేసింది. ఇప్పుడు మారుతి సుజుకి స్విఫ్ట్ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్-షోరూం రూ .8.1 లక్షలకు పెరిగింది. ఈ కారులో 1.2-లీటర్ కె12ఎన్ పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. ఈ ఇంజన్ 90 బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఇంజిన్ పిస్టన్ కూలింగ్ జెట్, హై కంప్రెషన్ రేషియో, కూల్డ్ ఇజిఆర్ సిస్టమ్‌ను అందించారు. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్విఫ్ట్ కారు 23.20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 23.76 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
undefined
జూన్ 2021లో మారుతి సుజుకి 1.65 లక్షలకు పైగా వాహనాలను తయారు చేసింది. ఇంతలో కోవిడ్-19 మహమ్మారి సెకండ్ వేవ్ తరువాత ఆటో మార్కెట్ తిరిగి ఊపందుకుంది. కరోనా మహమ్మారి నుండి ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడటంతో భారతదేశంలోని ప్రధాన కార్ల తయారీ సంస్థల జూన్ నెల అమ్మకాల గణాంకాలు గణనీయంగా పెరిగాయి. మారుతి సుజుకి జూన్‌లో మొత్తం 1,30,348 యూనిట్లను విక్రయించింది, గత నెల మేలో అమ్మకాల కంటే 35,293 యూనిట్లు ఎక్కువ.
undefined
అమ్మకాల గణాంకాలలో అత్యధిక లాభం కాంపాక్ట్ సెగ్మెంట్ వాహనాల్లో నమోదైంది. వీటిలో స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో అండ్ డిజైర్ ఉన్నాయి. ఈ కార్ల అమ్మకాల సంఖ్య మేలో 20,343 యూనిట్ల నుండి జూన్‌లో 68,849 యూనిట్లకు పెరిగింది. ఆల్టో అండ్ ఎస్-ప్రెస్సోలతో మినీ కార్ల విభాగంలో కంపెనీ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. అమ్మకాల సంఖ్య మేలో 4,760 యూనిట్ల నుండి జూన్ 2021 లో 17,439 కు పెరిగింది.
undefined
click me!