ఇండియన్ యూట్యూబర్ ట్వీట్‌కు టెస్లా సి‌ఈ‌ఓ రిప్లయ్.. ఆ కారణంగానే ఆలస్యం అంటూ వెల్లడి..

First Published | Jul 26, 2021, 11:22 AM IST

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా  ఎలక్ట్రిక్ కార్ల కోసం భారతదేశంలోని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో టెస్లా  కంపెనీ భారత్‌కు రాబోతున్నట్లు ప్రకటించింది. కానీ టెస్లా కార్ల లాంచ్ కోసం ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టోచ్చు.  

టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఎలోన్ మస్క్ ప్రఖ్యాత సౌత్ ఇండియన్ యూట్యూబర్ మదన్ గౌరీ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ మా కంపెనీ కార్లను త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయాలని కోరుకుంటున్నామని అయితే భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకం ప్రపంచంలోనే అత్యధికమని అన్నారు.
భారతదేశంలో క్లీన్ ఎనర్జీ వాహనాలను డీజిల్, పెట్రోల్ కార్లుగా పరిగణిస్తున్నారని, భారతదేశ వాతావరణ మార్పు లక్ష్యాలకు అనుగుణంగా లేదని ట్విట్టర్‌లో మదన్ గౌరీకి సమాధానమిస్తూ ఎలోన్ మస్క్ చెప్పారు. టెస్లా కార్లను త్వరలో భారత్‌లో లాంచ్ చేయాలని గౌరీ మస్క్‌ అభ్యర్థించారు.

టెస్లా కార్లను ఈ ఏడాది చివరిలోగా భారతదేశంలో విడుదల చేయాలనుకుంటున్న సంగతి మీకు తెలిసిందే. అసెంబుల్డ్ కార్లపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని పలు మంత్రిత్వ శాఖలను, నీతి ఆయోగ్‌ను టెస్లా కోరినట్లు ఒక నివేదిక తెలిపింది. టెస్లాకు భారతదేశంలో తయారీ విభాగాన్ని స్థాపించడానికి ఒక సువర్ణావకాశం ఉందని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇవ్వడమే దీనికి కారణం.
ప్రస్తుతం పూర్తిగా తయారు చేసిన కారు దిగుమతిపై కస్టమ్స్ సుంకం 60 నుండి 100 శాతం మధ్య ఉంటుంది. ఇది ఇంజిన్ సైజ్, ధర, భీమా, ట్రాన్స్ పోర్ట్ పై ఆధారపడి ఉంటుంది.

Latest Videos

click me!