ఇలాంటి పరిస్థితిలో కస్టమర్లను ఆకర్షించడానికి, అమ్మకాలను పెంచడానికి మారుతి సంస్థ కార్లపై డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకువచ్చింది. మారుతి కంపెనీ ఏ కారుపై ఎంత డిస్కౌంట్, బెనెఫిట్స్ అందిస్తుందో చూడండి..
మారుతి సుజుకి ఆల్టో 800మారుతి సుజుకి పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు మారుతి ఆల్టో 800 పై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. మారుతి చౌకైన కారు మారుతి సుజుకి ఆల్టోను కొనుగోలు పై రూ .15 వేల నగదు తగ్గింపును అందిస్తోంది. దీనితో పాటు పాత కారు ఎక్స్ ఛేంజ్ పై మరో రూ.15 వేల అదనపు తగ్గింపు ఇస్తుంది. అయితే మోడల్ ప్రకారం వినియోగదారులకు రూ .10 వేల నుండి 20 వేల రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందించనున్నారు. ఈ కారుపై రూ .5000 కార్పొరేట్ డిస్కౌంట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.
మారుతి ఆల్టో 800 కారుకు 796 సిసి పెట్రోల్ ఇంజన్, 40.3బిహెచ్‌పి శక్తిని, 60 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొంతకాలం క్రితం ఆల్టో కారుని అప్ డేట్ ఇంజన్ ఇంకా ఫీచర్స్ తో పరిచయం చేశారు. మారుతి ఆల్టోలో ఇప్పుడు చాలా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో సీట్ బెల్ట్ హెచ్చరిక, రివర్స్ పార్కింగ్ సెన్సార్, స్పీడ్ అలర్ట్ వంటి ఫీచర్స్ లభిస్తాయి. భద్రతా ఫీచర్స్ గురించి మాట్లాడితే యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి) వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఆల్టో రెనో క్విడ్, డాట్సన్ రెడిగోతో కార్లతో పోటీపడుతుంది.
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోమారుతి 'మైక్రో-ఎస్‌యూవీ' ఎస్-ప్రెస్సో పై కూడా గొప్ప ఆఫర్లను అందిస్తోంది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కొనుగోలుపై రూ .12 వేల నగదు తగ్గింపు ఇస్తుంది. కానీ ఎస్-ప్రెస్సో సిఎన్‌జి మోడల్‌పై ఎటువంటి డిస్కౌంట్ లేదు.
మారుతి ఎస్-ప్రెస్సో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. 68 హెచ్‌పి శక్తితో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఎమ్‌ఎమ్‌టి ఆప్షన్ కూడా ఉంది. మారుతి ఎస్-ప్రీసో 21.7 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది.
మారుతి సుజుకి వాగన్-ఆర్మే నెలలో మారుతి వాగన్-ఆర్ కొనుగోలు చేసే వారికి రూ .10,000 నగదు తగ్గింపు ఇస్తున్నారు. కానీ మారుతి సిఎన్‌జి వెర్షన్‌పై ఎలాంటి డిస్కౌంట్ లేదు.మారుతి వాగన్-ఆర్ రెండు పెట్రోల్ ఇంజన్లు ఒకటి 1,0 లీటర్, 1.2 లీటర్ ఇంజన్ ఆప్షన్ తో అందిస్తుంది. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 68 హెచ్‌పి శక్తిని, 1.2-లీటర్ ఇంజన్ 83 హెచ్‌పిని ఇస్తుంది.వాగన్-ఆర్ మాన్యువల్ ఇంకా ఏఎంటి గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. వాగన్ ఆర్ హ్యుందాయ్ సెంట్రోతో పోటీపడుతుంది.